Friday: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా.. అయితే శుక్రవారం రోజు అమ్మవారి ముందు ఇలా దీపారాధన చేయాల్సిందే!
లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శుక్రవారం రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు విశేషంగా అమ్మవారి ముందు దీపారాధన చేయాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Mon - 27 January 25

ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని రకాల పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం ఉంది అంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అయితే అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ సంపద కూడా రెట్టింపు అవుతుందని లక్ష్మీదేవి కూడా ఇంట్లో కొలువై ఉంటుందని చెబుతున్నారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరగాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే శుక్రవారం రోజు అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ విధంగా దీపాన్ని పెట్టుకోవాలి. ఒక ఐదు తమలపాకులను తీసుకోవాలి. ఐదు తమలపాకులకి గంధం రాసి, పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తమలపాకుల్ని గుండ్రంగా పేర్చాలి. దాని మీద ఒక మట్టి ప్రమిదని పెట్టాలి. మట్టి ప్రమిదని కూడా కుంకుమ గంధం, కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పును వేసి, అందులో కూడా పసుపు, కుంకుమ వెయ్యాలట. రాళ్ల ఉప్పు నిండా వేసేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇంకో ప్రమిద తీసుకుని అందులో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులని ఏక వత్తులు చేసి ఉప్పు వేసిన దానిపై పెట్టి దీపారాధన చేయాలి. తర్వాత ఈ దీపానికి చుట్టూ పూలు పెట్టి అలంకరించుకోవాలి. ఈ దీపానికి తర్వాత హారతి ఇచ్చి అక్షింతలు కూడా వేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చట.
శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆవులకు పచ్చ గడ్డిని ఆహారం కింద పెడితే మంచిదట. లేదంటే నెయ్యి, బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టవచ్చని చెబుతున్నారు. శుక్రవారం నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మల్లెపూలను సమర్పిస్తే మంచిదట. డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదట. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే మంచిదని దాంపత్య జీవితం కూడా బాగుంటుందని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఐదు దీపాలని వెలిగించి, హారతి ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుందట. దీనిని పంచముఖి దీపం అని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు.