Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే చాలు.. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే!
ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాధారణంగా ఆర్థికపరమైన
- By Anshu Published Date - 05:51 PM, Mon - 21 November 22

ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాధారణంగా ఆర్థికపరమైన సమస్యలు కుటుంబంలో కలహాలు అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలకు వాస్తు సరిగ్గా లేకపోవడం కూడా కారణమని చెబుతూ ఉంటారు నిపుణులు. మరి ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్న, ఇంట్లో ఉండేవారు ఆయురారోగ్యాలతో జీవించాలి అన్న తప్పకుండా వాస్తు టిప్స్ ను పాటించాల్సిందే. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి వాస్తు చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంట్లో ఈశాన్యం మూలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్య దిక్కులో ఎటువంటి చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దిక్కులో వస్తువులు కాకుండా గంగా జలాన్ని ఉంచడం మంచిది. అలాగే ఎప్పుడు ఆహారం తినే సమయంలో తూర్పుదిక్కుకు కూర్చుని తినాలి. ఈ విధంగా తూర్పుకి ముఖంగా కూర్చుని తినడం వల్ల ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదు. అదేవిధంగా ఇంట్లో తులసి చెట్టు దగ్గర నిత్యం నెయ్యితో దీపారాధన చేయాలి. నిత్యం ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది.
అదేవిధంగా ఉదయం లేవగానే చాలామంది చుట్టూ ఉన్న వస్తువులు అలాగే ఇంట్లో ఉండే వారి ముఖాలను చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. అయితే ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడంతో పాటు తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.