Vastu Tips: త్వరగా పెళ్ళి కావాలంటే ఈ వాస్తు టిప్స్ ను పాటించాల్సిందే..?
సాధారణంగా పెళ్లి అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం లాంటిది. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అని చెబుతూ ఉంటారు. అయితే వివాహం విషయంలో కొంతమంది తొందరపడుతూ ఉంటారు.
- By Anshu Published Date - 06:30 AM, Sun - 4 September 22

సాధారణంగా పెళ్లి అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం లాంటిది. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అని చెబుతూ ఉంటారు. అయితే వివాహం విషయంలో కొంతమంది తొందరపడుతూ ఉంటారు. ఏజ్ ఎక్కువ అయిపోయింది పెళ్లి కాలేదు అని మదన పడుతూ ఉంటారు. కానీ వివాహం బంధాన్ని ఆ దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడని మనం ఎన్ని సంబంధాలు చూసినా ఎన్ని విధాలుగా ప్రయత్నించిన చివరికి ఆ దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. ఇక ఆడవారు మగవారు కూడా వారికి నిర్దిష్ట వయస్సు రాగానే జీవిత భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు సంబంధం అన్ని సెట్ అయ్యాయి ఇక పెళ్లి జరగబోతోంది అనుకుంటున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కారణాల వల్ల విడిపోతూ కూడా ఉంటాయి. చాలామంది ఇటువంటి సంఘటనలకే మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మరి కొంతమంది అందుకు తగ్గ పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటారు. అయితే ఇoటిలోని వాస్తు దోషం మీ వివాహ అవకాశాలను అడ్డగిస్తుoదని మీకు తెలుసా? ఏంటి వివాహానికి, వాస్తు దోషాలకు సంబంధం ఏముంది అనుకుంటున్నారా?ఇంట్లో ఉండే కొన్ని వాస్తు దోషాలు, వాస్తవానికి మీ భాగస్వామిని గుర్తించే అవకాశాన్ని ఆలస్యం చేయవచ్చని మీకు తెలుసా ? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..తల్లిదండ్రులను భాదించే వాటిలో మొదటిది వారి పిల్లలు సరైన వయస్సులో, సరైన వ్యక్తిని వివాహం కాకపోవడం.
వారు వివాహ వయస్సును చేరుకున్న తర్వాత, జరిగే ఆలస్యం వారికి ఆందోళన కలిగిస్తు ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది వారి పిల్లల వివాహంలో జరుగుతున్న ఆలస్యానికి కారణాన్ని, పరిష్కారాన్ని కనుగొనలేక సతమతమవుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలలో ఎదురయ్యే ఆటంకాలను తొలగేందుకు ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు. ఎవరైనా వాస్తు శాస్త్ర నిపుణులను కలిసి మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలున్నాయేమో పరీక్షించి, వారి సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే పెళ్లికి సిద్దమవుతున్న అమ్మాయి ఇంటి దక్షిణ నైరుతిలో మూలలో నిద్రించకూడదు. మీ వివాహ అవకాశాలు పెరగడానికి వాయువ్య దిశలో నిద్ర పోవడం మంచిది.
వివిధ కారణాల మూలంగా ఆ దిక్కున సౌకర్యంగా లేని పక్షంలో, మీరు తూర్పు లేదా పశ్చిమ దిశలో పడుకోవచ్చు. అదేవిధంగా పెళ్లికి సిద్దమవుతున్న అబ్బాయి ఆగ్నేయ దిశలో ఉన్న పడక గదిలో నిద్రపోకూడదు. ఈశాన్య దిశలో పడుకోవాలీ. ఇది సాధ్యపడకపోతే, దక్షిణం లేదా పశ్చిమ దిక్కులలో పడుకోవాలలి. అలాగే జీవిత భాగస్వామిని కనుగొనడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు
అయితే, పెళ్లి చేసుకున్న వ్యక్తి తేలికపాటి రంగుల దుస్తులతో నిద్రించెలా చేసుకోవడం మంచిది. ఇందుకోసం మేలైన ఊదా, గులాబీ, పసుపు లేదా తెలుపు షేడ్స్ ఉన్న దుస్తులు ఎన్నుకోవడం మంచిది. ఇది గదిలో సానుకూల పవనాలు వీచేలా మరియు అసాధారణ శక్తిని ప్రసరించేలా చేస్తుంది. అలాగే త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి తన మంచం క్రింద ఎటువంటి ఇనుప వస్తువులను ఉండకూడదు. అలాగే ఇనుప వస్తువులను మంచం కింద ఉంచుకుని నిద్రపోవడం చేయరాదు. మంచం క్రింద లేదా గదిలో వస్తువులు ఎలా పడితే అలా కాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.