Money: డబ్బు చేతిలో నిలవడం లేదా.. వెంటనే వీటిని సరిదిద్దుకోండి?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలని రాత్రి, పగలు కష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం
- By Nakshatra Published Date - 06:00 AM, Thu - 9 March 23

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలని రాత్రి, పగలు కష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం కొంతమంది తిండి తిప్పలు మానేసి మరి డబ్బు సంపాదించడంపై దృష్టి పెడుతూ ఉంటారు. అయినప్పటికీ సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితులు ఎదురవకూడదు అని రూపాయి రూపాయి పోగేసుకున్నప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలు ఎదురవ్వడానికి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు.
ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి నుంచి వ్యాపార స్థలాలు ఆఫీసుల్లో వరకు ప్రతి ఒక్క చోట కూడా వాస్తు విషయాలను నమ్ముతున్నారు. ఇది ఇలా ఉంటే మీ ఇంట్లో డబ్బు నిలవకపోతే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలి. చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలి పోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసెయ్యాలి. అలాగే మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇక ఇంట్లోని బెడ్ రూం దగ్గర ఇనుప కడ్డీని కానీ ఇనుప వస్తువును కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుతుంది. బెడ్ రూం ఎంట్రెన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనుప కడ్డీ లేదంటే వస్తువును వేలాడ దీస్తే మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు, నగలతో కళకళలాడుతూ ఉండాలి.

Related News

Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…
సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. (Business Idea)ఏది సరైన మార్గమో, దేని ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చో తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలి. తెలివిగా పని చేయడం ద్వారా డబ్బు(MONEY) సంపాదించవచ్చు. ఇంటి టెర్రస్ ఖాళీగా ఉంటే, అక్కడ మనం అనేక రకాల వ్యాపారాలు ప్రారంభించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో పంటలు పండించుకునేందుకు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు భూమి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు�