Dussehra 2023 : దసరా వేళ.. శుభముహూర్తం, అమృతకాలం, వర్జ్యం వివరాలివీ
Dussehra 2023 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ.
- By Pasha Published Date - 07:51 AM, Mon - 23 October 23

Dussehra 2023 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. ఈ పవిత్రమైన రోజున పాలపిట్టను చూడటాన్ని శుభప్రదంగా భావిస్తారు. దీంతోపాటు శమీ వృక్షాన్ని పూజిస్తారు. దసరా పండుగ టైంలో ముఖ్యమైన పనులను స్టార్ట్ చేయాలని అనుకుంటే.. శుభముహూర్తం ఏ సమయంలో ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఆవివరాలను ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
- హిందూ క్యాలెండర్ ప్రకారం..ఇవాళ సూర్యోదయం 5 గంటల 58 నిమిషాలకు అయ్యింది. సూర్యాస్తమయం సమయం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు కానుంది.
- ఇవాళ నవమి తిథి మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల వరకు ఉంది. తర్వాత దశమి తిథి మొదలవుతుంది.
- శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల వరకు ఉంది. దాని తర్వాత తదుపరి ధనిష్ట నక్షత్ర సమయం మొదలవుతుంది.
- అతిగండ యోగం అర్ధరాత్రి 2 గంటల 46 నిమిషాల వరకు ఉంది.
- కౌలువ కరుణం ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు, దీని తర్వాత బాలువ కరుణం రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది.
- ఇవాళ అమృతకాలం ఉదయం 7 గంటల 28 నిమిషాల వరకు ఉంది. తిరిగి తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుంచి 5 గంటల 54 నిమిషాల వరకు ఉంది. ఈ అమృత కాలాన్ని శుభ సమయంగా పరిగణిస్తారు.
- ఇవాళ రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 9 వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆసమయంలో చేయరు.
- ఇవాళ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు ఉంది . తిరిగి మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల నుంచి 3 గంటల 13 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది.
- వర్జ్యం అంటే విడువ తగినది. అంటే.. అశుభ సమయం.ఈ టైంలో శుభకార్యాలు, ప్రయాణాలు చేయకూడదు. వర్జ్యం ఇవాళ రాత్రి 7 గంటల 27 నిమిషాల నుంచి 8 గంటల 57 నిమిషాల వరకు ఉంది.
Also Read: Hamoon – Rains Today : ‘హమూన్’ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.