Spirituality: మీరు చనిపోయినట్టు కల వస్తే అది దేనికి సంకేతమో తెలుసా?
చనిపోయినట్టు కల వస్తే అది దేనికి సంకేతం అన్న అంశాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 05:00 PM, Tue - 10 September 24

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు.. ఇలా చెడ్డ కళలు పీడకలలు వచ్చినప్పుడు చాలామంది తెగ భయపడిపోతూ ఉంటారు.. మరి ముఖ్యంగా చావుకు సంబంధించిన కలలు వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. కొన్నిసార్లు మన కలలో మనమే చనిపోయినట్టుగా కూడా కలలు వస్తూ ఉంటాయి. మరి అలా రావడం మంచిదేనా, అది దేనికి సంకేతమో, అలాంటప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీరు చనిపోయినట్లు కలలో కనపడితే, మీకున్న అన్ని రకాల బాధలు తొలగిపోయినట్లే అంటున్నారు. ఇదేవిధంగా సముద్రం, వికసిస్తున్న పూలు, యువతితో కలవడం లేదా చూడటం, ప్రసాదం లభించినట్లు కలవస్తే, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, ఆలయాన్ని చూడటం, నగలు దొరకడం లాంటి కలలు ఇంకా ఏనుగుపై సవారీ చేయడం, పండ్లు తీసుకున్నట్లు కలలు రావడం, అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనపడటం లాంటి కలలు వస్తే ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ కలలో రక్తం చూడటం, స్తనపానం చేస్తున్నట్లు, మద్యం, నూనె సేవిస్తున్నట్లు, మిఠాయి తినడం, వివాహం జరిగినట్లు, పోలీసును కలలో చూడటం లాంటివి, తమరు గుండు గీయించుకున్నట్లు కలలో కనపడితే మరణ వార్త వినాల్సి వస్తుందట.
విధవకు గెడ్డం పెరగడం లాంటి దృశ్యం కలలో కనపడితే పునర్వివాహం జరిగే సంకేతాలు ఉన్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసికొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలి అంటున్నారు జ్యోతిష్యులు. కలలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. మీకు కలలో పాము కనిపించి అది కాటు వేసి వెళ్ళిపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే పాము కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారట.