Dream: కలలో ఇవి మీకు కనిపిస్తే చాలు.. కష్టాలను తీరడంతో పాటు అఖండ రాజయోగం పట్టినట్టే!
కలలో మనకు కనిపించే కొన్ని రకాల సూచనలు వస్తువులు వంటివి మన భవిష్యత్తును సూచిస్తాయని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:40 AM, Sat - 4 January 25

కలలో మనకు భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంటే ముందుగా జరగబోయే విషయాన్ని కలల రూపంలో ఒక సూచికను పంపిస్తుందట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థం ఉంటుందని చెబుతున్నారు. మనకు వచ్చే కొన్ని రకాల కలలు మనల్ని కష్టాలను గట్టెక్కించడంతోపాటు రాజయోగం పట్టబోతోంది అనడానికి సంకేతాలుగా భావించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో మీకు దేవుడు కనిపిస్తే తర్వాత రోజు వెంటనే స్నానం చేసి గుడికి వెళ్లి దేవుడుని దర్శించుకోవాలట. అయితే పగటి పూట వచ్చే కలలు ఫలించవట. అలాగే రోజంతా దేని గురించైనా ఆలోచిస్తే అవి కలలో వస్తే ఆ కలలు కూడా ఫలించవని చెబుతున్నారు.
ఏనుగు మీద ఎక్కినట్లు, తల్లని గుర్రం మీద ఎక్కినట్లు, తెల్లని ఎద్దుమీద ఎక్కినట్లు కల వస్తే గొప్ప స్థాయిని చేరుకోబోతున్నామని అర్థం. వారు ఉన్న స్థానంలోంచి మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తారని అర్థం అంటున్నారు. అలాగే కలలో తెల్లని హంసలు, కోళ్లు, చకోర పక్షలు కనబడితే తొందరలోనే వివాహ యోగం ఉందని అర్థమట. సముద్రం దగ్గర, చెరువు దగ్గర తామరాకు మీద కూర్చొని పాయసం తాగుతున్నట్లు గనుక కల వస్తే వారికి త్వరలోనే అఖండ రాజయోగం దక్కుతుందని అర్థం అంటున్నారు. ఏదో ఒక విధంగా వీరికి అష్టైశ్వర్యాలు లభిస్తాయట. అలా జీవితంలో తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుందట. విడిపోయిన భార్యా భర్తల్లో ఎవరికైనా ఒకరికి ఇద్దరూ కలిసి ఒకే కంచంలో తింటున్నట్లు కలవచ్చినా, భర్త తొడమీద భార్య కూర్చున్నట్లు కలవచ్చినా ఇద్దరూ త్వరలోనే కలుసుకోబోతున్నారని అర్థం అంటున్నారు.
మనకు ఎవరైనా తెల్లని గొడుగు పట్టినట్లు కలవచ్చిన, తెల్లని హారం వేసినట్లు కల వచ్చినా, ఎవరైనా విసనకర్రతో మనకు గాలి విసురుతున్నట్లు కలవచ్చినా వారు త్వరలోనే చక్రవర్తి కాబోతున్నట్లు అర్థమని హిందూ స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో గులాబీలు, ఎర్రని పుష్పాలు, తామర పువ్వులు గనుక కనిపిస్తే తొందరలోనే ఇంట్లో మహాలక్ష్మీ కాలు పెట్టబోతోందని అర్థం అంటున్నారు పండితులు. అలాగే మీకు వున్న అన్ని ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. ఇక కలలో దేవతలు గనుక కనిపిస్తే ఇక నక్కతోక తొక్కినట్లేనని పండితులు చెబుతున్నారు. కలలో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవాలయానికి మరుసటి రోజు స్నానం చేసుకొని వెళ్లి ఆ దేవుడికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించాలట. కొందరికి దేవుడు కాకుండా కేవలం దేవాలయం, గోపురం లాంటివి కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు కుల దైవానికి నమస్కరించి, దేవాలంలో అర్చన చేయించుకోవాలని చెబుతున్నారు.