Thursday: గురువారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎలాంటి సమస్యలైనా మాయం అవ్వాల్సిందే!
గురువారం రోజున ఒక్క పని చేయడం వల్ల కొన్ని సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:11 PM, Sun - 9 February 25

మామూలుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సమస్యలు ఉండనే ఉంటాయి. అవి ఆర్థికపరమైన సమస్యలు లేదంటే కుటుంబ సభ్యులు లేదా శారీరక, మానసిక సమస్యలు కావచ్చు. అలాగే ఉద్యోగం లేదని కొందరు పెళ్ళి కాలేదని కొందరు పిల్లలు కలగడం లేదని కొందరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే గురువారం రోజు ఒక పని చేయాలని చెబుతున్నారు. ఇంతకీ గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పసుపును హిందూ ధర్మంలో పవిత్రమైనదిగా భావిస్తారు.
అయితే ఆ పసుపును ఉపయోగించడం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చట. గురువారం రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అలాగే గురు గ్రహానికి సంబంధించినది కూడా. కాబట్టి ఈ రోజున ఎవరికి తెలియకుండా పసుపును దానం చేయాలని ఇలా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు. గురువారం రోజున గురు గ్రహాన్ని బలపరచడం కోసం ఇలా పసుపును దానం చేయాలని, ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే పసుపు ముద్దను దానం చేయాలట.. ఇలా దానం చేయడం వల్ల డబ్బుల కష్టాలన్నీ తీరిపోతాయట.
ఇంట్లో సంపాదన నిలబడుతుందని అప్పులు కూడా నెమ్మదిగా తీరుతాయని, మీకు రావాల్సిన డబ్బులు తొందరగా అందుతాయని చెబుతున్నారు పండితులు. అలాగే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి తీరిపోవడం కోసం పసుపు ముద్దను దానం చేయాలని చెబుతున్నారు. పసుపు ముద్దను గురువారం దానం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందట. కేవలం ఇంట్లో మాత్రమే కాదు, మనిషిలో ఉన్న నెగిటివిటీ కూడా పోతుందట. పాజిటివిటీ పెరుగుతుందట. కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుందట. ప్రశాంతంగా కూడా ఉంటుందని, ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని చెబుతున్నారు.