Donate: దానాలు చేస్తున్నారా.. అయితే ఏ దానం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?ఏ దానం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
మామూలుగా దానధర్మాలు చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. మనకు ఉన్నంతలో దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని భగవంతుడు ఆశీస్సులు తప్పకు
- By Nakshatra Published Date - 08:00 AM, Mon - 12 February 24
మామూలుగా దానధర్మాలు చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. మనకు ఉన్నంతలో దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అని చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి దానం చేయాలి అని ఉంటుంది కానీ, ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాలు తెలియదు. మరి దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అతిథులకు అన్నము, నీరు ఇచ్చి తృప్తి పరిచే వారికి స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయట.
దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం కంటే గొప్ప పని ప్రపంచంలో ఏదీ లేదని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్పారు. దానం చేసినవారికి సద్గతులు ప్రాప్తిస్తాయని, అన్నము, నీరు అన్ని జీవులకు ప్రాణాధారము కాబట్టి దానం చేయవలసిన వస్తువులలో అతి ముఖ్యమైనవి ఇవి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారట. బంగారాన్ని ఎవరైనా దానం చేస్తే కూడా మంచి జరుగుతుందని బంగారు అగ్నితో సమానం కాబట్టి బంగారాన్ని దానం చేయడం అగ్నిని దానం చేయడంతో సమానం. ఇక దానాలలో తర్వాత గో దానానికి దక్కుతుందని, గోవును బ్రాహ్మణులకు దానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు ప్రాప్తిస్తాయని చెప్పారు మహా శివుడు.
కపిల గోవును దానం చేస్తే 21తరాల పితరులు స్వర్గానికి వెళ్తారని చెప్తున్నారు. ఆ తర్వాత దానాలలో ముఖ్యమైనది భూ దానము. భూదానం చేస్తే భూమి ఉన్నంత కాలం స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయట. భూమి లోపల సకల సంపదలు ఉంటాయి. కాబట్టి భూమిని దానం చేసిన వారికి సకల సంపదలను తిరిగి పొందుతారని చెబుతున్నారు. ఆ తర్వాత దానాలలో గొప్ప దానం కన్యాదానం. కన్యాదానం చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు అని, కన్యా దానం చేసిన వారికి తేజస్సు యశస్సు కలుగుతాయి అని చెబుతారు. ఆ తర్వాత దానాలలో ముఖ్యమైనది విద్యాదానం. అయితే విద్యాదానం మాత్రం అర్హులకు మాత్రమే చేయాలని విద్యా దానం చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. బట్టలు దానం చేస్తే అన్ని పీడల నుండి విముక్తి, ఎవరినైనా జల ప్రవాహాలను దాటిస్తే మన దుఃఖం తొలగిపోవడం, రహదారుల పక్కన బాటసారులకు సత్రాలు కట్టించి ఆశ్రయం కల్పిస్తే సకల శుభాలు చేకూరుతాయి. అందుకే దానాలు సర్వశ్రేష్టం.
Tags
Related News
Monday: సోమవారం రోజు శివుడికి బిల్వపత్ర ఆకులను ఎందుకు సమర్పిస్తారో తెలుసా?
సోమవారం రోజు బిల్వపత్ర ఆకులను పరమేశ్వరుడి పూజలో ఉపయోగించడం వెనుక ఉన్న కారణాలను తెలిపారు.