Dream: కలలో మీకు రామ మందిరం శ్రీరామచంద్రుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మామూలుగా మనం పడుకొని నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు కంటూ ఉంటాం. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు అలాగే మరికొన్ని
- By Nakshatra Published Date - 05:30 PM, Sun - 11 February 24
మామూలుగా మనం పడుకొని నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు కంటూ ఉంటాం. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు అలాగే మరికొన్ని దేవుళ్లకు సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి. దేవుళ్లకు పూజ చేసినట్టు ఆలయాల సందర్శించినట్టు ఇలా రకరకాల కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్ర ప్రకారం మామూలుగా కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. చాలామందికి కలలో ఆలయాలు వస్తాయి. అయితే మీకు కలలో ఎప్పుడైనా రామ మందిరం శ్రీ రామచంద్రుడు కనిపించారా. ఒకవేళ అలా కనిపిస్తే దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇక ఇప్పుడు దేశమంతా అయోధ్య రామ మందిరం గురించి చర్చ చేస్తున్న వేళలో అయోధ్య రామాలయం కూడా ఎక్కువగా కలలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్న ఎక్కువగా ఆలోచించినా ఆ విషయాలను చూస్తున్నా కూడా తప్పకుండా అవి కలలో వచ్చే అవకాశం ఉంటాయి. ప్రస్తుతం చూసినా అయోధ్య రామయ్యే.. ఇక ఇలాంటి సమయంలో దేశమంతా జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగి పోతుంది. ఏ గ్రామం చూసినా ఏ నోట విన్నా కోదండరామయ్య కబుర్లు, ఇలా ఎటు చూసినా శ్రీరాముడి రూపాలే. ఒక పక్క అంక్షింతలు పంచుతూ శోభాయాత్రలు, మరోపక్క రఘురాముడి చిత్రాలు, చిన్నారుల వేషధారణలతో అనేక ప్రదర్శనలను నిర్వహిస్తూ పులకించిపోతున్నారు.
మరి అలాంటి రాముడు లేదా రామమందిరం మీ కలలో కనిపిస్తే, అది శుభ సంకేతంగా బావించాలి. కలలో శ్రీరాముని చూడటం విజయాన్ని jసూచిస్తుంది. అలాంటి కల రావడం ద్వారా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, మీరు విజయం సాధించబోతున్నారని అర్థం. మీకు జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉంటే అది తప్పకుండా తీరుతుందని దీని అర్ధం. త్వరలో మీ జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయని అర్థం. ఇది సంపద, ఆర్థిక శ్రేయస్సును సంపాదించడానికి ఒక సూచికగా కూడా ఉంటుంది. మీ కలలో రామమందిరాన్ని చూసినట్లయితే, దాని అర్థం మీకు అంతా శుభమే జరుగుతుందని కాబట్టి రామయ్య కు సంబంధించిన కలలు హాయిగా కనవచ్చు.
Related News
Sachin Tendulkar: సచిన్ టెండూలర్కర్ ఎమోషనల్ ట్వీట్.. ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని నోట్..!
2 ఏప్రిల్ 2011 తేదీని ఏ భారతీయుడు మరచిపోలేడు. MS ధోని ఐకానిక్ సిక్స్‌తో టీమ్ ఇండియా ICC వరల్డ్ కప్ 2011 టైటిల్‌ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ ఇండియా తొలి ప్రపంచకప్ గెలిచింది. అప్పటికి సచిన్ టెండూల్కర్ వయసు 10 ఏళ్లు.