Tulsi Plant: తులసి మొక్క ఎందుకు అంత పవిత్రంగా బావిస్తారు.. పండితులు ఏం చెబుతున్నారంటే?
Tulsi Plant: హిందువులు తులసి మొక్కను ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారో దాని వెనుక ఉన్న రహస్యం ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే తులసి మొక్కను అత్యంత పవిత్రంగా బావించడం వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Thu - 6 November 25
Tulsi Plant: తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. చెట్లను దేవత స్వరూపాలుగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది.
ప్రతి రోజు సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర దీపం పెట్టే ఇంట్లో సిరిసంపదలు తాండవిస్తాయని పెద్దలు అంటారు. తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. భగవంతునికి నివేదించే ప్రసాదాలపైనా తులసి దళం ఉంచడం వలన ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుందని చెబుతుంటారు. అలాగే ప్రాణం పోయే సమయంలో గొంతులో తులసి తీర్ధం పోయడం మనకు తెలిసిన విషయమే. కాగా తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు, అగ్ర భాగమందు నాలుగు వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పక చదువుకోవాలట. “యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవతా! యదగ్రే సర్వ వేదాశ్య, తులసీం త్వాం నమామహ్యం” అని చెప్పి నమస్కరించుకోవాలట. కాగా కార్తిక మాసంలో తులసి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా తులసికి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్క వద్ద ఉసిరి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.