Agni Sakshi: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకుండా ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా పెళ్లిళ్లు వేదమంత్రాల సాక్షిగా, అగ్నిసాక్షిగా, పంచభూతాల సాక్షిగా జరుగుతాయని అంటూ ఉంటారు. అందుకే చాలామంది ఏదైనా మాట చెప్పేటప్పుడు
- By Nakshatra Published Date - 08:50 PM, Mon - 5 June 23
సాధారణంగా పెళ్లిళ్లు వేదమంత్రాల సాక్షిగా, అగ్నిసాక్షిగా, పంచభూతాల సాక్షిగా జరుగుతాయని అంటూ ఉంటారు. అందుకే చాలామంది ఏదైనా మాట చెప్పేటప్పుడు కూడా నేను అగ్నిసాక్షిగా తాళి కట్టాను అని చెబుతూ ఉంటారు. పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని పురాణాలు చెబుతున్నాయి. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. అందుకే ఆయన సాక్షిగా శ్రీరాముడు మైత్రి చేసుకున్నాడు. అగ్ని పునీత అయిన సీతాదేవిని అయోధ్యకి తీసుకొచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. దేవతలకు అగ్ని పురోహితుడని చెబుతారు.
అయితే వివాహ సమయంలో అగ్ని సాక్షి అని ఎందుకు అంటాం. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆలనా పాలనా సోముడు అనగా చంద్రుడు చూస్తాడట. చంద్రుడు చల్లనివాడు, చక్కనివాడు అందుకే చిన్నపిల్లల్లో అవే లక్షణాలు కనిపిస్తాయి. నిండు చంద్రుణ్ణి ఎంత చూసినా తనివి తీరనట్టే, చిన్నారులను చూసినప్పుడు కూడా మనసంతా ప్రశాంతంగా, ఆ నవ్వు వెన్నెలని తలపించడంతో పాటు ఆ నవ్వులను ఎన్ని కష్టాలు అయినా ఏ బాధలైనా కూడా మర్చిపోవచ్చు. కొంత వయసు వచ్చాక ఆమె బాధ్యతని గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. చంద్రుని సాక్షిగా, గంధర్వుడు స్వీకరించాడన్నమాట.
గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కాబట్టి అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందచందాలు, గుణగణాలు ఇచ్చి ఇక నా పని అయింది నీ వంతు అని చెప్పి అగ్నికి అప్పగిస్తాడు. అంటే గంధర్వుడి సాక్షిగా అగ్ని స్వీకరిస్తాడు. అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక పెళ్లి సమయంలో అగ్ని సాక్షిగా కన్యని వరుడికి అప్పగిస్తారు. చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వ సాక్షిగా అగ్నిఈమెను రక్షించగా, అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు. సృష్ఠిలో మనకు ఏదైనా గోచరం కావాలి అంటే దానికి కావాల్సిన రూపం ఇచ్చేది అగ్ని. మన దేహంలో జఠరాగ్ని, కంటిలో ప్రకాశం, శరీరంలో ఉష్ణత్వం, సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని అంటూ సమస్తం అగ్నిమయం. క్రోధాగ్ని, కామగ్ని, తపోగ్ని ఇలా సర్వం అగ్నిమయం జగత్. ఈశ్వరుని బ్రహ్మజ్యోతి స్వరూపంచ అని అన్నారు.
Related News
Wedding: బ్యాచిలర్స్‌కు బ్యాడ్ న్యూస్… పెళ్లి అవ్వాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే..!
మళ్లీ ఆగస్టు 8 తర్వాతే ...పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు.