Bhuloka To Yamaloka : భూలోకం టు యమలోకం .. ఆత్మల పయనం ఇలా..
Bhuloka To Yamaloka : జననం ఎంత నిజమో.. మరణమూ అంతే నిజం !! జననం, మరణం గురించి గరుడ పురాణంలో చక్కగా, అర్ధవంతంగా వివరణ ఉంది.
- By pasha Published Date - 04:30 PM, Mon - 2 October 23

Bhuloka To Yamaloka : జననం ఎంత నిజమో.. మరణమూ అంతే నిజం !! జననం, మరణం గురించి గరుడ పురాణంలో చక్కగా, అర్ధవంతంగా వివరణ ఉంది. ప్రస్తుతం పితృ పక్షం నడుస్తున్నందున దీని గురించి తెలుసుకోవడం ముఖ్యం. మరణ సమయంలో వ్యక్తి మాట్లాడలేడు , కదలలేడు అని గరుడ పురాణం అంటోంది. మనిషి దేహాన్ని ఆత్మ విడిచిపెట్టగానే ఇద్దరు యమదూతలు వచ్చి.. ఆ ఆత్మను తీసుకొని యమలోకానికి బయలుదేరుతారు. భూమికి 1.32 లక్షల కిలోమీటర్ల దూరంలో యమలోకం ఉందని గరుడ పురాణం చెబుతోంది. నరకంలో విధించే శిక్షల గురించి మార్గం మధ్యలో యమదూత వివరిస్తాడు.
యమదూత చెప్పే మాటలు విని..
యమదూత చెప్పే మాటలు విని ఆత్మ ఏడుస్తుంది. యమలోకానికి చేరుకునే మార్గంలో వైతరణి నదితో పాటు 86 వేల నదులు ఉన్నాయి. ఈ దారిలో ఆత్మ ఎంతో ఇబ్బంది పడుతుందని గరుడ పురాణం చెబుతోంది. అయినా సరే.. యమదూతలు ఆగ్రహించి ఆత్మపై కొరడా ఝుళిపిస్తారు. చివరకు యమదూతలు ఆత్మను యముడు శిక్షించే ప్రదేశానికి తీసుకెళ్తారు. ఆ ఆత్మ యమరాజు ఆజ్ఞ మేరకు.. యమ దూతలతో కలిసి మళ్లీ భూమిపై ఉన్న తన నివాసానికి వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
యమదూతలతో భూమిపై ఉన్న తన ఇంటికి తిరిగొచ్చిన ఆత్మ.. తిరిగి తన శరీరంలో చేరాలని కోరుకుంటుంది. కానీ యమదూతలు దానిని తిరిగి శరీరంలో చేరనివ్వరు. ఆకలి – దాహం వల్ల ఆత్మకు ఏడుపు మొదలవుతుంది. అటువంటి ఆత్మలు పిండ ప్రదానం జరిగే వరకు తృప్తి చెందవు. కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేయకపోతే ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. అందుకే మరణించిన 10 రోజుల తర్వాత పిండ ప్రదానం చేస్తారు. రెండోసారి ఇంటి నుంచి 47 రోజుల ప్రయాణం తర్వాత ఆత్మ యమలోకానికి (Bhuloka To Yamaloka) చేరుకుంటుంది. అక్కడ యమరాజు ఆత్మను శిక్షిస్తాడు.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
Related News

Garuda Purana: చనిపోయిన వ్యక్తికి సంబందించి ఆ మూడు వస్తువులు ఏమౌతుందంటే?
భూమిపై జన్మించిన ప్రతి ఒక్క జీవరాశి ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే. మనుషులు కూడా ఏదో ఒక రోజు చావుకి తల వంచాల్సిందే. మరణాన్ని అడ్డుకోవడం ఎవ