Astro : ఇంటి మద్యలో కూర్చొని జుట్టు దువ్వుకుంటున్నారా, అయితే నట్టింట్లో వెంట్రుకలు పడితే జరిగే నష్టం ఇదే..!!
వెంట్రుకలు ఇంట్లో పడటం అశుభం అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆరుబయట వాకిట్లో కానీ, ఇంటికి దూరంగా కానీ మహిళలు తమ కురులను దువ్వుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
- By hashtagu Published Date - 07:30 AM, Fri - 2 September 22

వెంట్రుకలు ఇంట్లో పడటం అశుభం అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆరుబయట వాకిట్లో కానీ, ఇంటికి దూరంగా కానీ మహిళలు తమ కురులను దువ్వుకోవాలని పెద్దలు చెబుతుంటారు. శాస్త్రాల ప్రకారం వెంట్రుకలు నట్టింట్లో పడితే శనిని ఆహ్వానించినట్లే అని, అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు గోళ్లు కూడా ఇంట్లోకట్ చేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శకున శాస్త్రం ప్రకారం జుట్టు విరబూసుకొని, జుట్టు దువ్వుకుంటున్న ఆడది కంటపడితే ఆ రోజు పనికి విఘ్నం కలుగుతుందట.
అయితే ఇందుకు పరిష్కారం ఉంది. ఆరు బయట కానీ, తోటలో కానీ, లేదా మీ ఇంటి వరండాలో, మహిళలు తమ కురులను దువ్వెనతో సరిచేసుకోవచ్చు. అలాగే ఊడిన వెంట్రుకలను జాగ్రత్తగా ఇంటికి దూరంగా పడవేయాలి. ఇక సైన్సు ప్రకారం చూసిన వెంట్రుకలు గాలిలో ఎగురుకుంటూ వచ్చి మన ఆహార పదార్థాలపై పడుతుంటాయి. అలాగే కూడా మన ఆహారం కలుషితం అవుతుంది.
ఇక మంగళవారం అయితే జుట్టును ఎక్కువగా దువ్వకూడదు. ఎందుకంటే మంగళవారం జుట్టు రాలితే అరిష్టం, అలాగే నట్టింట్లో కూర్చొని ఆడది, జుట్టు దువ్వుకోవడం, పేలు చూసుకోవడం చేస్తే ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది.