HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know About The Temple Which Is Open For Only Five Days In A Year

Telangana Amarnath: సాహసం.. సౌందర్యం.. సలేశ్వరం!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలేశ్వరం యాత్ర మొదలైంది.

  • Author : Balu J Date : 09-04-2022 - 4:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saleshwaram
Saleshwaram

చుట్టూ అడవి..కొండలు కోనలు .. జలపాతాలు… ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే  నల్లమల్ల అటవీ ప్రాంతం… ఆ ప్రాంతంలో లోయల లో వెలసిన  లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతం.. అలాంటి సలేశ్వరం జాతర మొదలైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసే పరమేశ్వరుని మహా దర్శన భాగ్యం ఉగాది పర్వదినం దాటిన తర్వాత లభిస్తుంది . ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఆ ఉత్సవాల విశేషాలు మీకోసం..

హైదరాబాద్ కు 120 కిలోమీటర్ల దూరాన, శ్రీశైలానికి 40 కిలోమీటర్ల (నాగార్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు సమీపంలోని నల్లమల ఫారెస్ట్) సమీపాన ఉంటుంది. అడవిలో నుంచి 25 కిలోమిటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ  రాళ్లు.. రప్పలు.. లోయలలో దిగి వెళ్ళాల్సిందే. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులవుతారు.  నింగి నుంచి నేలకు దిగుతున్న ఆకాశ గంగను తలపించేలా మహత్తర జలపాతం అది. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశం ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడి ప్రస్తుతం సలేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది.

వేయి అడుగుల లోతున ఉన్న లోయలోని సలేశ్వరం లింగమయ్యను భక్తులు దర్శనం చేసుకుంటారు. ‘వస్తున్నాం లింగమయ్య’ అని, తిరిగి వెళ్లేటప్పుడు ‘మళ్లీ వస్తాం లింగమయ్య’ అంటూ భక్తుల మారుమోగుతుంది. సలేశ్వరం లోయలో వేయి అడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైనుండి చల్లని నీరు ధారగా వస్తుంది. జనం పెరిగే కొద్దీ నీటిధార పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని,ఆయుష్షు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ ద్వారానికి కుడివైపున వీరభద్రడు,దక్షుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. సలేశ్వరం యాత్ర ముగిసిన తర్వాత అతి పెద్ద పులుల సంరక్షణాకేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ చూసి రావొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • nallamala
  • Saleshwaram
  • temple

Related News

Kanipakam Temple

కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

kanipakam temple : ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్‌సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాణిపాకం ఆలయం ఆన్‌లైన్ సేవ

    Latest News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

    • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

    • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd