HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do This To Seek Blessings Of Goddesses Lakshmi

Goddesses Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే…స్త్రీలు ఈవిధంగా చేయాలి..!!

ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలంటుంటారు మన పెద్దలు. ఈ సామేత ఊరికే అనలేదు.

  • By Hashtag U Published Date - 07:20 AM, Fri - 27 May 22
  • daily-hunt
New year wealth
goddesses lakshmi

ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలంటుంటారు మన పెద్దలు. ఈ సామేత ఊరికే అనలేదు. ఏ ఇళ్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్దతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుంది. ప్రతిరోజూ మహిళలు ఇలా చేస్తే ఇంట్లో నుంచి పేదరికం పలాయనం చిత్తగించడం ఖాయం.

* సూర్యోదయం అవ్వకముందే స్త్రీలు ఇంటిని పరిశుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ తాండవిస్తుంది.

* స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే, సూర్యోదయానికి ముందే ఆ పని చేయాలి. సూర్యోదయం తరువాత శుభ్రం చేయడం వల్ల ఇంట్లో పేదరికం కలుగుతుంది.

*ఇంటిని శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతోపాటు ఒంటికి బాధలు తప్పవు.

* కుటుంబ సభ్యులకు వంట చేయడం అంటే దేవునికి వండటం లాంటిదని అంటారు. అందుకే మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి.

* దైవ ప్రార్థన చేసి.. నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. కడుపునిండా తిని దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

*స్త్రీ ఎప్పుడూ కోపంగా లేదా చిరాకుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉండదు. అందుకే, స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండటం మంచిది. ఇది ఇంట్లో శాంతి, ప్రశాంతతను తెస్తుంది.

ఇంట్లోకి సంపద రావాలంటే…?

* సంధ్యాసమయంలో తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

* ఇంటికి నైరుతి మూలలో నీటి సంపులు వంటి నీటి వనరులను నిర్మించకూడదు. ఇది ఇంట్లో పేదరికం, వేదనకు కారణమవుతుంది.

* మీ నగదు పెట్టె లాకర్‌ను ఇంటి ఉత్తరం వైపు తెరిచి ఉంచాలి. కుబేర చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచితే ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుందని చాలా మంచి నమ్ముతుంటారు.

* ఇంట్లో నగదు పెట్టెను ప్రతిబింబించే విధంగా మీ నగదు పెట్టె ముందు అద్దం ఉంచితే… మీ సంపద రెట్టింపు అవుతుంది.

* కొన్ని ఇండోర్ ప్లాంట్లు, మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరించడంతోపాటు పేదరికాన్ని తగ్గిస్తుందని అంటారు.

* ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. ఇంటి మధ్యలో ఎలాంటివి నిర్మించవద్దు. అయితే, ఒక ఆలయాన్ని మాత్రం నిర్మించవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

  • 2027 World Cup: 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు రోహిత్‌, కోహ్లీ జ‌ట్టులో ఉంటారా? క్లారిటీ ఇదే!

  • Aadhaar: ఆధార్ కార్డుపై ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

Trending News

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd