Shani Dev: ఈ పనులు చేస్తే శని కటాక్షం పొందుతారు.. చేస్తున్నారో లేదో తెలుసుకోండి!
Shani Dev: జోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవునికి విశేష ప్రాధాన్యత అలాగే మహత్యం ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా శని దేవుని యొక్క కటాక్షం వారిపై ఉండాలి అని కోరుకుంటూ భావిస్తూ ఉంటారు. అందుకోసం అనేక రకాల పూజలు పునస్కారాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు
- By Nakshatra Published Date - 08:30 AM, Wed - 5 October 22
Shani Dev: జోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవునికి విశేష ప్రాధాన్యత అలాగే మహత్యం ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా శని దేవుని యొక్క కటాక్షం వారిపై ఉండాలి అని కోరుకుంటూ భావిస్తూ ఉంటారు. అందుకోసం అనేక రకాల పూజలు పునస్కారాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ మీలో కనుక ఈ లక్షణాలు ఉంటేదేవుని కటాక్షం తప్పకుండా ఉంటుంది. అలాగే సిరిసంపదలు కూడా లభిస్తాయి. మరి శని దేవుని కటాక్షం కలగాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శని దేవుడు నీ న్యాయదేవుడిగా భావిస్తూ ఉంటారు. మనిషి చేసే తప్పు ఒప్పు పనులకు శని దేవుడే ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. చెడు పనులు చేసే వాడి జీవితం కష్టం సుఖాలతో నష్టాలతో నిండిపోతుంది. అలాగే మంచి పనులు చేసే వారి జీవితంలో శని కటాక్షం లభిస్తుంది. శని కటాక్షం లభించింది అంటే ఆ మనిషి జీవితంలో దేనికి కొదువ ఉండదు అని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలి అంటే మంచి పనుల ద్వారా శని కటాక్షం పొందవచ్చు. కాగా ఇంట్లో పూర్వీకుల క్రియా కర్మలు పూర్తి నిష్టతో, శ్రద్ధతో అంత్యక్రియలు జరిపిసంచడం వల్ల ఆ వ్యక్తి పై శని కటాక్షం తప్పక లభిస్తుంది.
శనిదేవుడికి శుచి శుభ్రత చాలా ఇష్టం. అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శారీరకంగా కూడా ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలి. గోర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. పెరగకుండా చూసుకోవాలి. అలాగే రావి చెట్టుకు పూజ చేయడం ద్వారా శని దేవుడి కటాక్షం పొందవచ్చు. శనివారం సాయంత్రం రావిచెట్టుకు దీపం వెలిగించాలి. రావిచెట్టుకు పూజించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడౌతాడు. అలాగే శనివారం రోజున శని దేవునికి ఇష్టమైన వస్తువులను దానాలు చేసి భోజనం పెట్టడం వల్ల శని దేవుని కటాక్షం లభిస్తుంది.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�