Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే చాలు.. అమ్మవారు ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే విధంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:43 PM, Sat - 22 February 25

మామూలుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం చాలామంది ఎన్నో పూజలు పరిహారాలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. కాగా లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగి ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే అమ్మవారు ఒక చోట నిలకడగా ఉండదు. ఒకచోటి నుంచి ఒక చోటికి వెళుతూ ఉంటుంది. అలా వెళ్లకుండా అమ్మవారు ఇంట్లోనే తిష్ట వేయాలి అంటే కొన్ని రకాల నియమాలు పరిహారాలు పూజలు చేయడం తప్పనిసరి. లక్ష్మీ అనుగ్రహం కోసం కేవలం పూజలు చేయడమే మాత్రమే కాదు ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి ఇల్లాలిని గౌరవిస్తూ కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ఇంటి వాతావరణం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
ఇకపోతే లక్ష్మీదేవికి ఎలా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అన్న విషయానికి వస్తే.. లక్ష్మీదేవి మీద అలిగి వెళ్లిపోయిన కూడా ఆమెను తిరిగి ప్రసన్నం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే ఇందుకోసం “ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధన ధాన్యాది పతయే. ధన ధాన్య సమృద్ధి మి దేహి దాపయా స్వాహా అనే మంత్రాన్ని జపించాలట. ఉదయం నిద్ర లేచి పనులన్నీ పూర్తి అయిన తర్వాత చక్కగా తల స్నానం చేసి ఇక పీట మీద లక్ష్మీదేవి కుబేరుడు ఉన్న చిత్రపటాన్ని పెట్టాలట.
ఆ ఫోటో ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఆ ఫోటోకి ఎదురుగా ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలట. ధూపం కూడా వేయాలని చెబుతున్నారు. పూజ చేస్తూ గణపతిని ఆరాధించాలట. మంత్రా సనంలో కూర్చుని 108 సార్లు పైన చెప్పిన మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే కుబేరుడు ధనప్రాప్తి ఇస్తాడట.. అదే చెక్కపీఠం మీద ఏడు గవ్వలను ఉంచి పూజ చేస్తే ధన ప్రాప్తి మరింత త్వరగా లభిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు కుబేర అనుగ్రహం కూడా కలుగుతుందట. అప్పుడు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని చెబుతున్నారు.