Wednesday: డబ్బుకు లోటు ఉండకూడదు అనుకుంటే బుధవారం రోజు ఈ విధంగా చేయాల్సిందే!
Wednesday: డబ్బు పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, డబ్బుకు లోటు ఉండకూడదు అనుకుంటే బుధవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:20 AM, Wed - 8 October 25

Wednesday: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంత సంపాదించిన కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక పోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ఆర్ధిక సమస్యల నుంచి బయట పడటం కోసం ఎన్నో రకాల పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని సార్లు పరిష్కారం కావు. అయితే మీరు కూడా అలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లతే బుధవారం రోజు ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెబుతున్నారు.
ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కొంటుంటే బుధవారం రోజున గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు కచ్చితంగా చేయాలని, ఆ పనులు చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమౌతాయని, మీ చేతికి డబ్బు కూడా అందుతుందని చెబుతున్నారు. మరి ఇంతకీ బుధవారం రోజు ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే.. వారంలో బుధవారం రోజు గణేశుడికి కేటాయించారు. గణపయ్యను పూజించడానికి బుధవారం అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పాలి. ఈ రోజున ఆయనకు పూజ చేయడం లేదా ఉపవాసం ఉండటం వల్ల కెరీర్ వృద్ధికి, డబ్బుకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చట.
అంతేకాకుండా బుధవారం రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల బుధ గ్రహం బలపడటమే కాకుండా జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు, బుధవారం ఉదయం శంఖాన్ని ఊదడం శుభప్రదం అని చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. మీ విజయానికి మార్గం ఏర్పడుతుందని, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. బుధవారం, తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, మనల్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత పవిత్రమైన తులసి మొక్కను పూజించాలట. తులసి మొక్కకు నీరు అర్పించి, దాని దగ్గర నెయ్యి దీపం వెలిగించాలని, బుధవారం పవిత్రమైన తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెబుతున్నారు.
బుధవారం, గణేశుడి రోజున, పేదలు, నిస్సహాయులకు సహాయం చేయడానికి మనం మన వంతు కృషి చేయాలట. మనం బియ్యం, ఆకుపచ్చ దుస్తులు వారికి అవసరమైన వస్తువులను దానం చేయాలని, బుధవారం ఈ పనులు చేయడం ద్వారా, మీ కోరికలన్నీ నెరవేరుతాయని, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెబుతున్నారు. బుధవారం ఆవులకు తినడానికి ఆకుపచ్చ గడ్డి లేదా మేత ఇవ్వాలట. వీటిని ఆవులకు ఇవ్వడం చాలా శుభప్రదం అని బుధవారం ఆవులకు సంబంధించిన ఈ పని చేయడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోయి, సంపద శ్రేయస్సు పెరుగుతుందని చెబుతున్నారు. బుధవారం నాడు మనం స్వచ్ఛమైన మనస్సుతో గణపతి పూజ చేయాలట. ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి, గణేశుడికి దుర్వా, పసుపు పువ్వు, మోదకం సమర్పించాలట. బుధవారం నాడు ఈ పనులు చేస్తే, అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.