Karthika Masam: కార్తీక మాసంలో చేయకూడని,చేయాల్సిన పనుల గురించి మీకు తెలుసా?
కార్తీకమాసంలో పొరపాటున కూడా తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:36 PM, Tue - 5 November 24

చాలామంది కార్తీక మాసంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. తెలియక చేసే తప్పుల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరీ కార్తీక మాసంలో చేయాల్సిన అలాగే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కార్తీక మాసంలో కూడా చాలా ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు. ఉదయం పది అయ్యే వరకు లేవకుండా అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటారు. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలట. ఇంట్లోని తులసి చెట్టు ముందు ఉదయం, దీపాలు వెలిగించాలని చెబుతున్నారు.
ఈ మాసంలో గుడిలో దీపాలు వెలిగించేందుకు నూనె, దీపాలు దానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే ఈ నెలలో భగవద్గీత చదివినా కూడా చాలా ప్రయోజనం ఉంటుందట. అలాగే ఈ నెలలో నేలపై పడుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఈ మాసంలో ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. ఈ మాసంలో ఎట్టి పరిస్థితులలో మాంసాహారం తినకూడదట. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే పొట్లకాయ, పెరుగు,జీలకర్ర,బెండకాయ వంటీ కూరగాయలను కూడా తినకూడదని చెబుతున్నారు.
ఇకపోతే ఈ ఏడాది అనగా 2024 లో నవంబర్ రెండవ తేదీన మొదలైన కార్తీకమాసం డిసెంబర్ 1తో ముగుస్తుంది. ఈ నెల రోజులపాటు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ, మద్యపానం వంటి వాటిక దూరంగా ఉంటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ, పూజిస్తూ దీపాలు వెలిగించాలని చెబుతున్నారు. శివుడు లేదా విష్ణువు ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం మంచిది అని చెబుతున్నారు.