Amavasya: మే 30న సోమవతి అమావాస్య…పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!!
హిందూ క్యాలెండర్ లో ప్రతి అమావాస్యకు ఏదోక ప్రత్యేకత ఉంటుంది. జ్యేష్టమాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక విశిష్టిత ఉంటుంది.
- By Hashtag U Published Date - 06:00 AM, Sat - 28 May 22
హిందూ క్యాలెండర్ లో ప్రతి అమావాస్యకు ఏదోక ప్రత్యేకత ఉంటుంది. జ్యేష్టమాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక విశిష్టిత ఉంటుంది. దీనిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ ఏడాది మే 30వ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది. ఈ రోజున శనిజయంతి, సావిత్రి వ్రతం కూడా వస్తున్నాయి.
30 ఏళ్ల తర్వాత ఇలా మూడు పండుగలు ఒకేరోజు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే వస్తుంటాయి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే…ఖచ్చితంగా శివుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి..ఎలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు తెలుుకుందాం.
సోమవతి శుభ సమయం:
ఆదివారం మే 29 , 2022 మధ్యాహ్నం 2గంటల 54 నిమిషాలకు ప్రారంభమై…మే 30, 2022 సాయంత్రం 4గంటల 59 నిమిషాలకు ముగుస్తుంది. అయితే మే 30వ తేదీని అంటే సోమవారం ఉదయం నాడు తిథి రావడంతో ఇదే రోజు అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఎన్నో గొప్ప ఫలితాలు పొందుతారు.
పూజా విధానం:
సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామునే లేచి సూర్యదోయం కంటే ముందే స్నానం చేయాలి. పూజకు ముందు కొన్ని నీళ్లను చేతిలో పట్టుకుని వ్రత సంకల్పం చేయాలి. సూర్యదేవునికి సమర్పించాలి. ఈరోజున పూర్వీకులను స్మరించుకుంటూ మీకు తోచినంత దానం చేస్తే అంతా శుభం జరుగుతుంది. సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజను చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇదే రోజున వివాహిత స్త్రీలు రావిచెట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం ఉండి పూజలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.
చేయాల్సిన పనులు:
-సోమవతి అమావాస్య రోజున రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
-పసుపు రంగు దారాన్ని 108సార్లు చెట్టుకు చుట్టాలి.
-పూర్వీకులను స్మరించుకోవాలి.
-వస్త్రాలను దానం చేయాలి.
-పూర్వీకులను స్మరించుకుంటూ నువ్వులను దానం చేయాలి.
-రావి మొక్కను నాటడం…నిరంతరం సేవించండి
ఇలా చేస్తే తల్లిదండ్రులు, పూర్వీకులు సంతోషిస్తారాని బ్రహ్మాణులు చెబుతున్నారు.
చేయకూడని పనులు:
-సోమవతి అమావాస్యరోజున మాంసం, మద్యం ముట్టుకోకూడదు
-జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు
-రావిచెట్టును పూజించేటప్పుడు చెట్టును తాకవద్దు.
-ఎవ్వర్నీ దూషించకూడదు.
-చెడు మాటలు మాట్లాడకూడదు.
Related News
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక వృత్తాంతం
హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది...ప్రధానంగా హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా ప్రస్తావింపబడింది...హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అని అనడంలో అతిశయోక్తి లేదు.