Hanuman: ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?
హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాట్లను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:32 PM, Fri - 22 November 24

మామూలుగా చిన్న చిన్న గ్రామాలలో ప్రతి ఒక్క ఊరిలో ఈ గుడి ఉన్న లేకపోయినా హనుమాన్ గుడి తప్పనిసరిగా ఉంటుంది. హనుమాన్ గుడి లేకుండా ఊరు ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆంజనేయస్వామి కొందరు మంగళవారం రోజు పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది మంగళవారం రోజు స్వామివారిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే మామూలుగా చాలామంది హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు.
అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయేవి కూడా ఒకటి. మరి హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు స్త్రీలు ఎప్పుడు కూడా హనుమాన్ విగ్రహాన్ని తాకకూడదని చెబుతున్నారు. ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు ఆంజనేయ స్వామి పాదాలను కాకకూడదట. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన వారు ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు మాత్రమే చేయాలని మూడు, ఒకటి ఇలా ప్రదక్షిణలు చేయకూడదని చెబుతున్నారు.
అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులను సమర్పించడం మంచిదే కానీ, వీటిని సమర్పించేటప్పుడు 5 లేదా 9 తమలపాకులను మాత్రమే సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఆంజనేయ స్వామి మూలవిరాట్ నీ తాకడం పాదాలను తాకడం వంటివి చేయకూడదట. ఆలయానికి నమస్కరించుకోవాలని చెబుతున్నారు. అలాగే మనం తీసుకువచ్చిన పూలు పండ్లు టెంకాయలు వంటి వాటిని పూజారికి మాత్రమే ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.