Things: ఇంట్లో పొరపాటున కూడా ఈ ఐదు రకాల వస్తువులను అస్సలు ఉంచకండి.. ఉంచారో అంతే సంగతులు!
Things: మన ఇంట్లో పొరపాటున కూడా ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల వస్తువులను అస్సలు ఉంచకూడదని దీనివల్ల వాస్తు దోషాలతో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 PM, Sun - 16 November 25
Things: వాస్తు ప్రకారం ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రకాల వస్తువులను పొరపాటున కూడా మన ఇంట్లో అసలు ఉంచకూడదట. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయట. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే దానిని అస్సలు ఉంచకూడదట. అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచుకోవడం వల్ల అశుభం కలుగుతుందట. దీని వల్ల ఆర్థిక సమస్యలు కూడా వస్తాయట.
ఇంట్లో చిరిగి పోయిన, వాడనివి చాలా రోజుల నుంచి ఉన్నవి ఉండకూడదట. కేవలం ఇవే కాకుండా ఇంట్లో పాడైపోయిన పాత్రలు కూడా ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో సంతోషం దెబ్బతింటుందట. అశాంతి నెలకొంటుందట. అదేవిధంగా ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు వాడిన వస్తువులు ఉంటే ఉంచుకోవడం కూడా మంచిది కాదట. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయట. కాబట్టి మీ ఇంట్లో కూడా ఇలా పాత వస్తువులు ఉంటే వెంటనే వాటిని బయట పడేయడం మంచిది.
అలాగేఇంట్లో పాత వార్తా పత్రికలు ఉంటే వాటిని బయటపడేయడం మంచిది. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తులను కలిగిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు దురదృష్టాన్ని కూడా తీసుకొస్తాయట. వీటితోపాటుగా మీ ఇంట్లో పగిలిపోయిన వస్తువులు లేదా విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని బయటకు పారేయడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి నెగిటివ్ ఎనర్జీ ని ఆకర్షిస్తాయట. వీటివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని చెబుతున్నారు.