Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. చేశారో కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం!
శుక్రవారం రోజు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని అలా చేస్తే లేనిపోని సమస్యలను ఏరి కోరి మరి తెచ్చుకున్నట్టే అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:32 PM, Mon - 23 December 24

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. డబ్బు ఉంటేనే అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ డబ్బు ఉంటేనే గౌరవం విలువ ఇస్తారు. డబ్బు లేని మనుషులను ఒక మాదిరిగా చూస్తూ ఉంటారు. నీ దగ్గర డబ్బు లేకుంటే తెలిసినోడు పక్కనే ఉన్నా కనీసం పలకరించడు. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. చాలామంది తాము జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి, తనపై తన కుటుంబంపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇళ్లల్లో పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవిని రోజూ పూజిస్తే ఎప్పుడూ సంపద కొరత,ఆర్థిక నష్టాలు ఉండవని నమ్ముతారు.
సంపద, శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశిస్సుల కోసం శుక్రవారం చాలామంది ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. కేవలం పూజలు చేయడం మాత్రమే కాదండోయ్ లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులను కూడా చేయకూడదట. మరి శుక్రవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు లేదా ఇంట్లో మాంసాహారం వండకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదట. శుక్రవారం రోజున పొరపాటున కూడా మహిళలను లేదా బాలికలను అవమానించకూడదట. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. స్త్రీలను గౌరవించని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. శుక్రవారం ఎవరికైనా పంచదార ఇస్తే ఐశ్వర్యం పోతుందట.
శుక్రవారం రోజున పంచదార ఇవ్వడం వల్ల జాతకంలో సంపద, శ్రేయస్సు ఇచ్చే గ్రహం శుక్రుడు బలహీనపడతాడట. అలాగే డబ్బుకు సంబంధించిన ఏదైనా లావాదేవీకి శుక్రవారం దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి లేదా ఎవరి నుండి చాలా అవసరం ఉంటే తప్ప అప్పు తీసుకోకండి . శుక్రవారం ఆస్తులకు సంబంధించి ఎలాంటి పనులు కూడా చేపట్టకూడదట. శుక్రవారం ఆస్తిని కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించరు. ఎందుకంటే శుక్రవారం నాడు ఆస్తులు కొనుగోలు చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపించినట్లవుతుంది. శుక్రవారం నాడు పొరపాటున కూడా చిరిగిన, మురికి బట్టలు ధరించకూడదట.పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శుక్రవారం పూజ గది, వంటగదికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. పైన చెప్పిన పొరపాట్లు శుక్రవారం చేయకుండా ఉంటే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట.