Health Tips: పొరపాటున టీతో పాటు వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!
టీ తాగేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:30 PM, Thu - 10 October 24

భారతదేశంలో భారతీయులు ఎక్కువ శాతం మంది తాగే పానీయాలలో టీ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. చిన్న పెద్ద అని వయసుతో తీయడా లేకుండా ప్రతి ఒక్కరూ టీ కాఫీలు తాగుతూ ఉంటారు. కొందరు రోజుకి కనీసం నాలుగైదు సార్లు తాగితే మరి కొందరు రోజులో కనీసం ఒక్కసారైనా తాగనిదే రోజు కూడా గడవదని అంటూ ఉంటారు. అయితే టీ తాగడం మంచిదే కానీ చాలామందికి టీ తో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం అలవాటు. కానీ అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణు. మరి టీతో పాటు కలిపి వేటిని తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది టీ తో పాటుగా పకోడీ మిక్చర్ సమోసా వంటివి తింటూ ఉంటారు. శనగపిండితో తయారుచేసిన వాటిని తింటూ ఉంటారు. కానీ ఇలా అసలు తినకూడదట. ఇలా శనగపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే అవి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయట. అదే సమయంలో పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, టీ తాగేటప్పుడు ఈ చిరుతిండికి దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. అలాగే చాలామంది టీతో పాటుగా కూల్ గా ఉన్న పదార్థాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదట. ఇలా చల్లవి వేడివి వెంట వెంటనే తీసుకోవడం వల్ల వ్యవస్థ బలహీన పడుతుందట.
ఈ విధంగా చేస్తే మీకు వాంతులు, వికారం అనిపించవచ్చట. అందుకే టీ వంటి హాట్ డ్రింక్ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లని ఆహారం తినకూడదని సూచిస్తున్నారు. పసుపుతో చేసిన ఆహారాలు పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ తినే సుగంధ ద్రవ్యాలలో ఇది చాలా ముఖ్యమైనది అని కూడా అంటారు. అయితే, ఇది టీతో దూరంగా ఉండవలసిన పదార్ధం అని మీకు తెలుసా? అవును, పసుపు ఉన్న ఆహారాలు గ్యాస్, మలబద్ధకానికి కారణమవుతాయట. అందువల్ల, టీ తాగిన తర్వాత పసుపు ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఒక కప్పు వేడి టీతో గింజలు, ధాన్యాలు, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.