Home Tips: దీపం పెట్టిన తర్వాత అలాంటి పని చేస్తున్నారా.. అయితే జరిగేది ఇదే?
కాలం మారిపోవడంతో ఆహారపు అలవాట్లు జీవనశైలి మనుషుల ఖర్చులు అన్నీ మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో స్త్రీలు ఇంటిపట్టునే ఉంటూ కు
- Author : Anshu
Date : 30-06-2024 - 7:23 IST
Published By : Hashtagu Telugu Desk
కాలం మారిపోవడంతో ఆహారపు అలవాట్లు జీవనశైలి మనుషుల ఖర్చులు అన్నీ మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో స్త్రీలు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. కానీ రాను రాను స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద విదేశాలలో నగర ప్రాంతాలలో పురుషులు స్త్రీలు ఇద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. దీంతో పొద్దున అనంగా ఎప్పుడు వెళ్తే రాత్రి ఎప్పుడో వచ్చి వారి పనులు చేసుకుంటూ ఉంటారు.
అలా స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవదు. అలాంటప్పుడు ఉదయం పూట ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడానికి కూడా కుదరదు. ఒక వేళ పూజ చేసిన ఇంటి పనులు అలానే మిగిలిపోతాయి. తరువాత పనివారు వచ్చి ఇంటిని శుభ్రం చేస్తారు. ఆ సంగతి పక్కన పెడితే సాయంత్రం సమయంలో ముఖ్యంగా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. సాయంకాలం సమయంలో దీపం పెట్టిన తర్వాత తెలిసి తెలియకుండా చేసే కొన్ని రకాల తప్పులు వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే చాలామంది భార్యలు భర్తలు ఉదయమే పూజ చేసి ఆఫీసుకు వెళ్లడంతో తర్వాత ఆమె ఇంటిని శుభ్రపరచుకుంటుంది.
వాస్తవానికి ఇది సరైనది కాదు అని శాస్త్రం చెబుతోంది. కనుక అద్భుతమైన శుభఫలితాలను పొందడం కోసం శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరిచిన తరువాత పూజ చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని వాళ్ళు దీపారాధన వెలుగుతుండగా ఇంటిని శుభ్రపరిచరాదు. దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు. దీపం వెలుగుతుండగా ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి గురవుతాము. ఏ పని చేపట్టినా సకాలంలో జరగదు. అన్నింటిలోను నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కష్టాలు మొదలవుతాయి. ఇలా శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దేవతలు ఆగ్రహిస్తారు. కనుక ఉదయం తొందరగా లేచి సూర్యోదయానికి కంటే ముందు ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడం మంచిది.
ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
సూర్యోదయానికి కంటే ముందు అమృత ఘడియలలో పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఉండి అంతా మంచే జరుగుతుంది. 6 లోపు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కనీసం 7 గంటల లోపయినా పూజ చేయడం మంచిది. దీపారాధన చేసిన తర్వాత దీపం వెలుగుతూ ఉండగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రపరిచరాదు. సాయంకాలం సమయంలో కూడా రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ దీపం పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఇంటిని శుభ్రపరచకూడదు. ఇలా చేస్తే అనేక రకాల సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది.