Spiritual: ఐశ్వర్యాన్ని ప్రసాదించే గోధుమల దీపం.. దీపావళి రోజు ఎలా వెలిగించాలో తెలుసా?
Spiritual: ఐశ్వర్యం,ఆరోగ్యం, సంపద కలగాలి అంటే దీపావళి రోజున ఇప్పుడు చెప్పినట్టుగా గోధుమల దీపం వెలిగిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 06:00 AM, Fri - 17 October 25

Spiritual: మామూలుగా దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి దేవుని కూడా పూజిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రదేశాలలో దీపావళి పండుగ రోజున ఐదు రోజులు జరుపుకుంటారు. అందులో మొదటిది ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, నాగుల చవితి, అన్నచెల్లెల పండగగా జరుపుకుంటారు. మరీ ఈరోజుల్లో లక్ష్మిని ఎలా పూజించాలి ఏంటి అన్న విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపావళి పండగ మొదటి రోజుని ధన త్రయోదశిగా జరుపుకుంటారు.
ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు వచ్చింది. ఈరోజు లక్ష్మీదేవి కుబేరున్ని పూజిస్తారు. ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో వారి ఇంట్లో డబ్బులకు లోటు ఉండవట. అపమృత్యు దోషం తొలగిపోతుందని, అందుకే యమధర్మ రాజు అనుగ్రహం కోసం ఇంటికి దక్షిణ దిశలో యమ దీపాలను వెలిగించాలని చెబుతున్నారు. అక్టోబర్ 18 సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో యమ దీపాన్ని వెలిగించాలి. బియ్యం పిండితో ఒక ప్రమిదను చేసి ఆవు నూనె వేసి నాలుగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన యమధర్మ రాజు ఆశీస్సులు లభిస్తాయట.
అలాగే సాయంత్రం పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు మట్టి ప్రమిదలలో నెయ్యి దీపాలు వెలిగిస్తారు. అమ్మవారికి ఇష్టమైన కలుగ పువ్వుని దానిమ్మ వంటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి, కుబేరుడు ఆశీస్సులు లభిస్తాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 19న నరక చతుర్దశి వచ్చింది. ఈ రోజున అభ్యంగ స్నానం చేయాలి. తలకు, ఒంటికి నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండితో నలుగు పెట్టుకుని తల స్నానం చేయాలి. కొత్త వస్త్రాలు ధరించాలి ఇలా చేయడం వలన నరపీడ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
అంతేకాదు ఈ రోజు లక్శ్మిదేవిని పూజించి సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయట. దీపావళి పండగ అక్టోబర్ 20 సోమవారం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవి, గణపతిని పూజించాలి. ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలట. అంతేకాదు బంగారం, వెండి ఆభరణాలను, గులాబీ పువ్వను పెట్టి పూజించాలని చెబుతున్నారు. అదేవిధంగా దీపావళి రోజు సాయంత్రం గోధుమ దీపం పెట్టడం వలన అఖండ సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తుందట. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక పళ్ళెంలో గోధుమలు పోసి మట్టి ప్రమిదని ఆ గోధుమల మధ్యలో పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలట. ఈ దీపం ఎంత సేపు వెలిగితే.. అంత మంచిదని ఏడాదంతా డబ్బుకు లోటు అన్న మాటే ఉండదని చెబుతున్నారు. ఇలా వెలిగించిన దీపం కొండ ఎక్కిన తర్వాత ఆ గోధుమలను ఆవుకు ఆహారంగా అందించాలట. ఈ పరిహారంతో లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు..