Dhanteras: ధన త్రయోదశి రోజున ఉప్పుతో ఈ విధంగా చేస్తే చాలు.. కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!
Dhanteras: ధన త్రయోదశి రోజున ఉప్పుతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని, ఆ మార్పులను అసలు నమ్మలేరు అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 05:30 PM, Thu - 16 October 25

Dhanteras: ఈ సంవత్సరం ధన త్రయోదశి పండుగను అక్టోబర్ 18 వ తేదీన జరుపుకోనున్నారు. ఈ ధన త్రయోదశి రోజున యమధర్మరాజులను పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి కుబేరుడిని కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే యమ దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు ఈ రోజున ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. మరి ఉప్పుతో ధన త్రయోదశి రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ధన త్రయోదశి పండుగ రోజున ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు నెలకొంటాయట. అదేవిధంగా ధన త్రయోదశి రోజున ఉప్పును తప్పకుండా కొనుగోలు చేయాలని, ఉప్పు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. ఇంటికి ఎవరైనా వచ్చి ఉప్పు అప్పుగా అడిగితే అసలు ఇవ్వకూడదట. ముఖ్యంగా ఈరోజున అస్సలు ఇవ్వకూడదని చెబుతున్నారు.
అలాగే ధన త్రయోదశి రోజున ఆర్థిక స్తోమతను బట్టి డబ్బు లేదా అన్నదానం వంటివి చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ధన త్రయోదశి రోజు ఉప్పు కలిపిన నీటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద చళ్ళితే కష్టాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ధన త్రయోదశి రోజున బంగారం,వెండి వంటి ఖరీదైన వస్తువులతో పాటుగా చీపురును కొనుగోలు చేయడం అత్యంత శుభకరం అలాగే మంచిదని చెబుతున్నారు. ఈరోజున చీపురు ఇంటికి తీసుకు వస్తే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అని చెబుతున్నారు.