Diwali 2025: దీపావళి రోజు ఇవి కనిపిస్తే చాలు.. లక్ష్మిదేవి అనుగ్రహం మీపై ఉన్నట్లే.!
Diwali 2025: దీపావళి పండుగ రోజు మనకు కొన్ని రకాల జీవులు కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉన్నట్లే అని, లక్ష్మిదేవి ఆశీస్సులు మనపై ఉన్నాయని అర్ధం అంటున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Thu - 9 October 25

Diwali 2025: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ దీపావళి పండుగ రోజున ఇంటిని చక్కగా దీపాలతో అలంకరించి సాయంత్రం అయ్యేసరికి పిల్లలు అందరూ సంతోషంగా టపాసులు పేలుస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తితిని దీపావళి పండగగా జరుపుకుంటారు.
అయితే ఈ ఏడాది దీపావళి పండగ అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు వచ్చింది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాకుండా సురక్షితమైన జీవితం లభిస్తుందని, ఈ రోజున ప్రజలు తమ ఇళ్ళు, దుకాణాలు, కార్యాలయాలలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు. దీపావళి శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారట. మరి దీపావళి పండుగ రోజున వీటిని చూడటం శుభకరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా వర్ణించారు. దీపావళి రోజున ఎవరైనా గుడ్లగూబను చూసినట్లయితే వారిపై త్వరలో లక్ష్మీదేవీ ఆశీస్సులు లభించనున్నాయని నమ్మకం.
అంతేకాకుండా ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం త్వరలో ముగుస్తుందట. అలాగే సంపదల అధిదేవత లక్ష్మీదేవి కమలం పువ్వుపై కూర్చుని చేతిలో కమలం పువ్వు పట్టుకుంటుంది.అయితే దీపావళి సమయంలో మీరు కమలం పువ్వును చూసినట్లయితే మీ సంపద పెరుగుతుందట. అంతేకాదు దీపావళి రోజున లక్ష్మీ దేవికి పూజ సమయంలో కమలం పువ్వును సమర్పించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. అదేవిధంగా దీపావళి పండుగ రోజున మీరు కాకిని చూసిన లేదంటే ఇంటి ఆవరణలోకి కాకి వచ్చినా కూడా అది మీకు పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లభిస్తున్నట్లు సంకేతం కావచ్చని చెబుతున్నారు. కనుక దీపావళి వంటి పండగ రోజున కాకి మీ ప్రాంగణంలో లేదా టెర్రస్‌పై వాలితే మీకు మీ పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. వీటితో పాటు దీపావళి శుభ సందర్భంగా ఆవులు, బల్లులు, హిజ్రాలను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుందట.