Death Signs In Shiva Purana: మృత్యువు సమీపించేటప్పుడు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసా?
శివ మహాపురాణంలో పుట్టుకకు మరణానికి ఈ రెండింటికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి ముందు అతనికి క
- By Anshu Published Date - 06:45 PM, Sat - 9 December 23

శివ మహాపురాణంలో పుట్టుకకు మరణానికి ఈ రెండింటికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి ముందు అతనికి కనిపించే కొన్ని సంకేతాలను ప్రస్తావిస్తుంది. అలాంటి సంకేతాలు కనిపిస్తే మృత్యువు సమీపిస్తోందని అర్థమట. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ఒక వ్యక్తి చనిపోయే కొన్ని నెలల ముందు శరీరం నీలం రంగులోకి మారుతుంది. లేదంటే ఆ వ్యక్తి శరీరంపై ఎర్రటి గుర్తు కనిపిస్తుంది. ఇలాంటి సంకేతాలు కనిపించాయి అంటే ఆ వ్యక్తి ఆరు నెలలు మాత్రమే బ్రతుకుతాడు. లేదంటే ఆరు నెలల్లోపే మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే మనిషి చనిపోయేటప్పుడు వ్యక్తి శరీరంలోని కొన్ని భాగాలు పనిచేయడం మానేస్తాయి. అలా అవయవాలు పనిచేయడం మానేస్తే అలాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాగే నోరు, చెవులు, కళ్లు, నాలుక సరిగా పని చేయకపోతే, ఆ వ్యక్తి మరణానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ఎడమ చేయి నిరంతరం మెలితిప్పినట్లు లేదా శరీరంలోని మరేదైనా భాగానికి నొప్పి కలుగుతోందని మీరు చాలాసార్లు విని ఉండవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఎడమ చేయి మెలితిప్పినట్లు లేదా నోటి లోపల ఉన్న అంగుటిపై భాగం పొడిబారడం ప్రారంభిస్తే, శివ పురాణం ప్రకారం దాదాపు ఒక నెలలోనే చనిపోతాడట.
మరణ సమయం సమీపిస్తున్న వ్యక్తి నీటిలో, నూనె, నెయ్యి లేదా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. శివ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి తన నీడను చూడలేనప్పుడు, మరణం ఆసన్నమైందని తెలుసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి మరణించే సమయం ఆసన్నమైతే ఆ వ్యక్తికి చంద్రుడిని, నక్షత్రాలను సరిగా చూడలేడని శివపురాణంలో వివరించారు. అలాంటి వ్యక్తులు కేవలం ఒక నెలలోనే మరణిస్తారట. ఈ విధంగా ఒక వ్యక్తి మరణించే ముందుగా ఈ విధమైన సంకేతాలు కనిపిస్తాయట.