Chandra Grahan November 2022: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే?
రేపు అనగా నవంబర్ 8, 2022 న చంద్రగ్రహణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. కార్తీక పూర్ణిమ కూడా ఈ రోజే కావడం
- By Anshu Published Date - 02:41 PM, Mon - 7 November 22

రేపు అనగా నవంబర్ 8, 2022 న చంద్రగ్రహణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. కార్తీక పూర్ణిమ కూడా ఈ రోజే కావడం విశేషం. అంతేకాకుండా ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా రేపు ఏర్పడబోతోంది. కాగా పలువురు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ చంద్రగ్రహణం చాలా చెడ్డదని, ఈ గ్రహణ ప్రభావం రాశులపై తీవ్రంగా పడబోతోంది అని తెలిపారు. కాబట్టి చంద్రగ్రహణం సమయంలో 12 రాశుల వారు తప్పకుండా జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం చంద్రగ్రహణం ప్రభావం మరి ముఖ్యంగా మేషరాశిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రహణ సమయంలో మేష రాశి వారు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. గ్రహణ సమయంలో వీరికి అరిష్టాలు కూడా సంభవించవచ్చని కాబట్టి అందుకు అనుగుణంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. చంద్రగ్రహణం రేపు మధ్యాహ్నం 02:39 కు ప్రారంభం అయ్యి ఆ తర్వాత 06:19 కు ముగుస్తుందట. ఈ గ్రహణ సమయంలో మేష రాశి వాళ్లు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. అంతేకాకుండా మేష రాశి వారు గ్రహణం ముగిసే వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు.
అలాగే ఈ మేష రాశి వారు రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామికి పూజలు చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే మేష రాశి వారు గ్రహణ సమయంలో ధరించిన దుస్తులతోనే స్థానాలు చేయాల్సి ఉంటుందట. గ్రహం ప్రభావాలు మేషరాశిపై ఏ విధంగా ఉన్నాయంటే.. మీరు మానసిక తీవ్ర ఇబ్బందుల పాలవడంతో పాటు గందరగోళ పరిస్థితులకు గురి అవకాశాలు కూడా ఉన్నాయట. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. మేష రాశి వారు వారి ఆరోగ్యంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా పెద్ద వహించాల్సి ఉంటుందట. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, ఆఫీస్ లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోసం చూస్తున్న వారు చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి పనులు ప్రారంభించకూడదు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్రహణ సమయంలో ఎటువంటి పనులు మొదలుపెట్టిన ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుపుతున్నారు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మేష రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు.