Tulsi Plant: ఆదివారం తులసి మొక్క వద్ద దీపం పెట్టవచ్చా? పెట్టకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఆదివారం రోజు తులసి మొక్క వద్ద దీపారాధన చేయాలా వద్దా, అలాగే ఏ ఏ రోజుల్లో తులసి మొక్కతో నీటిని సమర్పించకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- By Anshu Published Date - 01:35 PM, Thu - 13 March 25

మామూలుగా చాలామంది తెలిసి మొక్కను పూజిస్తూ ఉంటారు కానీ, ఇలా పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వీటి కారణంగా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే తులసి మొక్కకు పూజ చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని, లేదంటే పూజ చేసినా కూడా ఆ ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు. అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని నియమాలను కూడా పాటించాలి. అటువంటి వాటిలో తులసి మొక్కకు నీరు సమర్పించడం, దీపాలను వెలిగించడం కూడా ఒకటి.
కొన్ని ప్రత్యేక సందర్భాలలో పూజలు చేయకూడదని అలాగే కొన్ని సమయాలలో నీటిని సమర్పించకూడదని చెబుతున్నారు. ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించడం నిషిద్ధం అని చెబుతూ ఉంటారు. అలాగే ఆదివారం తులసి మొక్కకు పూజ చేయకూడదని దీపాన్ని వెలిగించకూడదని చెబుతుంటారు. మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసి పూజ చేయాలని చెబుతూ ఉంటారు. ఇలా చేస్తే ఇంటి సౌభాగ్యం కొనసాగుతుందని చెబుతుంటారు. అయితే ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదని అంటూ ఉంటారు.
ఎందుకంటే తులసి మాత ఆదివారం రోజు విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందట. ఈరోజున తులసి మాత నీరు సమర్పిస్తే ఆ ఉపవాసానికి భంగం కలిగించినట్టు అవుతుందని ఒకవేళ మీరు పూజ చేసినా కూడా ఆ పూజ ఫలితం దక్కదు అని చెబుతున్నారు. అదేవిధంగా ఆదివారం రోజు తులసి మొక్క వద్ద దీపాలు వెలిగించడం కూడా ని సిద్ధమని చెబుతున్నారు. తులసి మొక్కను ఆదివారం రోజు తాగకూడదట. తులసి మొక్క వద్ద సాయంత్రం అనగా సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించకూడదని చెబుతున్నారు. తులసీ దేవి సూర్యాస్తమయం తరువాత నిద్రలోకి జారుకుంటుందని ఈ సమయంలో వారి ఆరాధన ఆమోదయోగ్యం కాదని నమ్ముతారు. అలాగే సంధ్య వేళ సమయంలో నీటిని కూడా సమర్పించకూడదని చెబుతూ ఉంటారు. ఆదివారాల్లో కూడా తులసి దగ్గర దీపాలు వెలిగించకూడదట. నిజానికి ఆదివారాన్ని సూర్యభగవానుని రోజుగా భావిస్తారు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. సూర్యుడు, విష్ణువును కలిసి పూజించకూడదని చెప్తారు. అందుకే ఈ రోజున తులసిని పూజించడం లేదా తులసి దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం. అలా కాకుండా గ్రహణ సమయంలో తులసిలో దీపం వెలిగించకపోవడమే మంచిది.