Lakshmi Idol: దీపావళి రోజు ఎలాంటి లక్ష్మీ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలో తెలుసా?
దీపావళి రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలట.
- By Anshu Published Date - 12:03 PM, Tue - 29 October 24

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలో దీపావళి పండుగ కూడా ఒకటి. ఈ దీపావళి పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో ఆనందంతో జరుపుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది అనగా 2024 లో అక్టోబర్ 31వ తేదీన ఈ దీపావళి పండుగను జరుపుకోనున్నారు. దీపావళి పండుగకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహాలను కూడా కొంటూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలేం రావని, ఇంట్లో సిరి, సంపదలు వెళ్లివిరుస్తాయని నమ్ముతారు.
అయితే అమ్మవారి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. కొన్ని తప్పులు చేశారంటే మీరు జీవితంలో ఎంతో నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అమ్మవారికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టమట. అందుకే మీరు ఈ దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనాలనుకుంటే అమ్మవారు తామర పువ్వుపై కూర్చున్న విగ్రహాన్నే కొనుగోలు చేయాలట. లక్ష్మీదేవి విగ్రహం ఎప్పుడూ కూడా కూర్చున్న భంగిమలోనే ఉండాలి. ఈ భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటుందని నమ్మకం. అదే నిలబడి ఉన్న విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకొస్తే అమ్మవారు మీ ఇంటి నుంచి చాలా త్వరగా వెళ్లిపోతారని చెబుతున్నారు.
లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ దీపావళికి కొనాలంటే అమ్మవారి చేతుల నుంచి నాణేలు బయటకు వచ్చే విగ్రహాన్నే మాత్రమే కొనాలి. ఇలాంటి విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా రావట. అలాగే డబ్బుకు కొదవ ఉండదట. ఏనుగులు రెండు వైపుల నుంచి డబ్బుల వర్షం కురిపిస్తున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదట. కాబట్టి దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసేవారు పైన చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు.