Brahma Muhurtha: బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు అదృష్టాన్ని సూచిస్తాయా.. ఆ కలలు ఎందుకంత ప్రత్యేకమో మీకు తెలుసా?
తెల్లవారుజామున సమయంలో వచ్చే కలలు నిజమవుతాయని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:10 AM, Mon - 17 February 25

మాములుగా నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. కొన్నిసార్లు మంచి కలలు వస్తే మరి కొన్నిసార్లు చెడ్డ కలలు పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే చెడ్డ కలలు వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మామూలుగా తెల్లవారుజామున వచ్చి కలలు నిజమవుతాయని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ తెల్లవారుజామున అనగా బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలకు ప్రాముఖ్యత కూడా ఉందని ప్రత్యేకత ఉందని అంటూ ఉంటారు. అలాగే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్వప్న శాస్త్ర ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు నిజమవుతాయని చెబుతున్నారు. అలాగే కలలో దేవతలు, పవిత్ర నదులు, లేత ఆకులు, పాలు లేదా కాంతివంతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తే అవి అదృష్టాన్ని, సిరిసంపదను, మంచి ఫలితాలను సూచిస్తాయట. కలలో నీరు నిండిన బిందె కనిపిస్తే అది చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఇది మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు వస్తాయని సూచిస్తుందట. అంతేకాదు కొన్ని శుభవార్తలు కూడా అందుతాయని చెబుతున్నారు. నీరు సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుందట. కాబట్టి ఈ కల ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు.
కలలో నదిని చూడటం కూడా చాలా పవిత్రమైనదిగా భావించాలట. నదీ ప్రవాహానికి చిహ్నం అని, మీ జీవితం కూడా సజావుగా సాగిపోతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని తొలగిపోతాయని అర్థం అంటున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అర్థం అంటున్నారు. కలలో నదిని చూడటం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుందట.
కలలో ధాన్యం కుప్పను చూడటం కూడా చాలా మంచిదట. ధాన్యం సమృద్ధికి చిహ్నం అని, ఇది మీ కష్టానికి ఫలితం దక్కుతుందని డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరబోతున్నాయని అర్థం అంటున్నారు. మీకు ఆర్థికంగా లాభం చేకూరి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు.
కలలో మెరుస్తున్న దీపం కనిపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం అంటున్నారు. ఇది మీకు త్వరలో సంపద వస్తుందని మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయని సూచిస్తుందట. ఈ కలలు బ్రహ్మ ముహూర్తంలో వస్తే చాలా శుభప్రదమని నమ్ముతారు. అయితే వీటిని కేవలం కలలుగానే చూడాలని, మీ కష్టానికి ఫలితంగానే మీకు మంచి జరుగుతుందని కలలు కేవలం సూచనలు మాత్రమే అని వాటిని నమ్మి ప్రయత్నం చేయడం మానకూడదని చెబుతున్నారు.