Bhadrachalam: భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఇలా బుక్ చేసుకోండి
- By Balu J Published Date - 11:32 PM, Sat - 20 April 24
Bhadrachalam: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా, ఈ నెల 17న రామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా ఇంటికే అందించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలు బుక్ చేసుకోవాలని సజ్జనార్ తెలిపారు. అలాగే, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే వారు 040 – 23450033, 040 – 690000, 040 – 694400669 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
తలంబ్రాల బుకింగ్ ఇలా
రాములోరి కల్యాణ తలంబ్రాల బుకింగ్ ను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం సైట్ లో అందుబాటులో ఉంచారు. తొలుత https://www.tsrtclogistics.in కు వెళ్లి.. తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత మీ చిరునామా, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత తలంబ్రాలు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఎంచుకోవాలి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151గా నిర్ణయించారు.
అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూపీఐ ద్వారా పేమెంట్ చెయ్యొచ్చు.
పేమెంట్ చెల్లించిన తర్వాత బుకింగ్ సక్సెస్ అయినట్లు ఓ ట్రాన్సాక్షన్ నెంబర్ తో ఆర్టీసీ నుంచి ఓ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ చిరునామాకు కల్యాణ తలంబ్రాలు వస్తాయి.
అటు, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ల నెంబర్లైన 040 – 23450033, 040 – 690000, 040 – 694400669ను సంప్రదించి వివరాలు తెలపాలి.
Tags
Related News
TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్ఆర్టీసీ క్లారిటీ
TSRTC: వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోల�