Plants: ఈ మొక్కలు ఇంటిని అందంగా మార్చడంతో పాటు నెగిటివిటీని కూడా దూరం చేస్తాయట.. అవేంటంటే!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్కలు ఇంటికి అందాన్ని తేవడంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగటివిటీని దూరం చేస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Tue - 6 May 25

మామూలుగా చాలామంది వాస్తు ప్రకారం ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు తెలిసి తెలియక పెంచకూడని మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు. అవి అందంగా కనిపించినప్పటికీ అది ప్రతికూలతలను ఏర్పరుస్తాయట. నెగిటివ్ ఎనర్జీ ని ఆకర్షిస్తాయని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్కలు ఇంటిని అందంగా ఉంచడంతోపాటు ప్రతికూలతలను దూరం చేస్తాయని చెబుతున్నారు. ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉండవలసిన మొక్క తులసి మొక్క. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు నిత్య పూజలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర గడప బయట తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క లేకుండా దాదాపుగా హిందువులు ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తులసి మొక్క ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ మొక్క ఇంట్లోని ప్రతికూలతను కూడా తొలగిస్తుందట.
అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంటి వద్ద ఉండవలసిన మొక్కలలో స్నేక్ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. స్నేక్ ప్లాంట్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదొక ఇండోర్ మొక్క. ఈ మొక్క గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగించి గాలిని శుద్ధి చేస్తుందట. అయితే ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఉండాల్సిన మొక్కలలో పీస్ లిల్లీ మొక్క కూడా ఒకటి. ఇది ఉన్న ప్రదేశం వాతావరణం అంతా కూడా సుఖసంతోషాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పాలి. ఇది గాలిని శుద్ధి చేయడంతో పాటు గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుందట.
ఈ మొక్కను ఇంట్లో పెట్టడం వల్ల ఎల్లప్పుడూ సానుకూలమైన వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మనీ ప్లాంట్ ను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్క ఎలా అయితే ఎదుగుతుందో మన ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ అనేదే ఉండదని చెప్తారు. ఈ మొక్కను అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ మొక్క ఎంత బాగా ఎదిగితే మన ఎదుగుదల కూడా అంతే బాగా ఉంటుందని చెబుతున్నారు. తులసి, మనీ ప్లాంట్ తర్వాత కలబంద మొక్క భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది. కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడమే కాకుండా ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మొక్క తక్కువ నీటితోనే పెరుగుతూ ఉంటుంది.