Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!
Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Sat - 8 November 25
Friday: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజున కొన్ని రకాలు పనిచేయడం నిషేధం. అలాగే కొన్ని రకాల పనులు చేయడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. వాటి వల్ల లేని పోనీ సమస్యలు వస్తాయట. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అదేవిధంగా శుక్రవారం రోజు డబ్బులు అప్పుగా ఇవ్వడం లేదంటే అప్పుగా తీసుకోవడం అసలు చేయకూడదట.
దానివల్ల చెడు జరుగుతుందని చెబుతున్నారు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజు వంట పాత్రలు కొనుగోలు చేయకూడదట. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. శుక్రవారం రోజు ఆస్తికి సంబంధించిన పనులు చేయకూడదట. అలా చేయడం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదని అమ్మవారు ఆగ్రహిస్తుందని చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజు చక్కెర ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేయకూడదట. ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహం బలహీన పడుతుందని చెబుతున్నారు. తప్పనిసరిగా ఇంటిని అలాగే వంటగదిని శుక్రవారం రోజు శుభ్రంగా ఉంచాలట.
చిరిగినా లేదా మాసిపోయిన ఉతకని బట్టలను ధరించకూడదని చెబుతున్నారు. ఈ విషయాలు తోచా తప్పకుండా పాటించాలని అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలట. అమ్మవారి పూజలో లక్ష్మి గవ్వలు, తామర పువ్వుల గింజల హారం, శంఖం వంటివి సమర్పించాలని చెబుతున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మరింత తొందరగా లభిస్తుంది అని చెబుతున్నారు.