Tortoise: ఇంట్లో ఎలాంటి తాబేలుని పెట్టుకోవాలి.. ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలో తెలుసా?
Tortoise: వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలుని ఏర్పాటు చేసుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:31 AM, Sat - 27 September 25

Tortoise: చాలామంది వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోవడంతో పాటు ఇంట్లో వస్తువులను కూడా అలాగే అమరుస్తూ ఉంటారు. కొన్ని కొన్ని వాస్తు నియమాలను విస్మరిస్తే వాస్తు దోషాలు ఏర్పడవచ్చు అని చెబుతున్నారు. చాలామంది ఇంట్లో పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం మంచిదే కానీ తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెట్టడం వలన సంపద, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయట. అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుందట. అలాగే ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయట. తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుందని చెబుతున్నారు. తాబేలు విగ్రహం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుందట.
అయితే తాబేలు విగ్రహాన్ని ఎప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా వాయువ్య దిశలో మాత్రమే ఉంచాలట. ఇది మీకు సానుకూల ఫలితాలను తెస్తుందని చెబుతున్నారు. ఇత్తడి, బంగారం లేదా వెండితో చేసిన తాబేలు విగ్రహాన్ని ఈ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఇంట్లో స్పటిక తాబేలు బొమ్మను పెట్టాలనుకుంటే దానిని ఈశాన్య దిశలో పెట్టుకోవడం మంచిది. వాస్తు శాస్త్రం కూడా నీరు నిండిన ప్రాంతంలో తాబేలు బొమ్మను ఉంచడం శుభప్రదంగా భావించాలి.
కానీ ఆ బొమ్మలో వేసిన నీటిని ప్రతిరోజూ మార్చాలట. మెటల్ తాబేలు సంపదను సూచిస్తుందట. కెరీర్ వృద్ధిని కోరుకుంటే మెటల్ తాబేలును ఆఫీసులో ఉంచడం మంచిదని, కెరీర్ లో పురోగతి సాధించాలనుకుంటే ఉత్తర దిశలో తాబేలును ఉంచడం మంచిదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు లేదా ఆగ్నేయ దిశలలో చెక్క తాబేలును ఉంచడం వల్ల ఇంటిలోని అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయట. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందం, మంచి కర్మ, సాధనతో నింపుతుందని పండితులు చెబుతున్నారు.