Astrology: బెడ్ రూమ్ లో మంచం కింద వీటిని పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
బెడ్ రూమ్ లో చాలామంది తెలిసి తెలియక మంచం కింద అనేక వస్తువులు పెడుతూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:04 PM, Fri - 21 February 25

మామూలుగా చాలామంది బెడ్రూంలో చాలా రకాల వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బెడ్ కింద తెలిసి తెలియక కొన్ని రకాల వస్తువులు పెడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. బెడ్ రూమ్ లో మంచం కింద వస్తువులు పెట్టొచ్చు కానీ ఏవి పడితే అవి పెడితే సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి బెడ్ రూమ్ లో ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం పడుకునే మంచం సరిగ్గా గుమ్మానికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి.
ఇల్లు ఇరుకుగా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మానికి ఎదురుగా మంచం వస్తే అప్పుడు దానికి ఎదురుగా ఒక కట్టె వేసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా, బాత్రూమ్ ఎదురుగా మంచం ఉండకూడదట. ఒకవేళ అలా వస్తే మామూలు సమయాల్లో ఎప్పుడూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండకుండా చూసుకోవాలట. ఈ నియమం తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. బెడ్రూమ్లో చాలా మంది మంచాన్ని ఏదో ఒక గోడకు అనించి ఉంచుతుంటారు. కానీ అలా ఉంచడం చాలా తప్పట. ఎప్పుడూ మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇలా మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉంటేనే ప్రాణశక్తి అనేది బాగా ఉంటుందట. అదృష్టలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుందట.
అద గోడకు అనించి ఉంచితే ప్రాణశక్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందట. బెడ్కాట్ మంచాలకు ఉండే స్టోరేజ్ ర్యాక్స్ లో చాలా మంది కొన్ని వస్తువులను స్టోర్ చేస్తుంటారు. అయితే వాటిల్లో అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంచడం మంచిదికాదని చెబుతున్నారు. అలా ఉంచడం వల్ల అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందట. కొందరు మంచం కింద పాత సూట్ కేసులు, పాత సామానులు వంటి కొన్ని పనికిరాని వస్తువులు పెడుతుంటారు. ఇలా పనికిరాని వస్తువులను మంచం కింద ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందట. ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా గడియారం, క్యాలెండర్ వంటివి కనిపించేలా కాకుండా కొద్దిగా పక్కకు ఏర్పాటు చేసుకోవాలట. ఎప్పుడు కూడా పడకగదిలో సీలింగ్ కి బ్లూ కలర్ వేయించుకోకూడదట. ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఎప్పుడైనా సరే బెడ్ రూమ్ లో నారింజ, పసుపు, ఎరుపు రంగు వంటివి ఉండేలా చూసుకోవాలట. అప్పుడు దంపతుల మధ్య అనుకూలత చాలా బాగుంటుందట.