Astrology: మరణించే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో మీకు తెలుసా?
మామూలుగా మరణం దగ్గర పడుతున్న కొద్ది సంకేతాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. మరణం అకస్మాత్తుగా రాదని, అది
- Author : Anshu
Date : 27-02-2024 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మరణం దగ్గర పడుతున్న కొద్ది సంకేతాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. మరణం అకస్మాత్తుగా రాదని, అది మనకు కొన్ని సంకేతాలు చూపించే వస్తుందని అంటున్నారు. మరణం వచ్చేముందు మనం గమనించక పోయినా సరే కచ్చితంగా కొన్ని సంకేతాలను చెప్పి మరీ వస్తుందని చెబుతున్నారు. మనిషి జీవితంలో తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో కచ్చితంగా వచ్చేది మరణం. అయితే మరి మరణం సమయం లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకు.. మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట.
నీళ్లలో చూసినా, నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదట. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నల్ల రంగులోనే కనిపిస్తాయట. అలాగే మనం నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదు అని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుందని, చనిపోయే వారికి కచ్చితంగా అది అర్థమవుతుందని చెబుతున్నారు పండితులు. అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చేయి దానికదే అదురుతుందట. మరణానికి ముందు కలలో ఇవి తప్పనిసరిగా వస్తాయి మరణం వచ్చే ముందు సూర్యుడు, చంద్రుడు, ఆకాశం మొత్తం ఎర్ర రంగులో కనిపిస్తాయని, బ్లూ రంగులో ఉండే ఈగలు తల చుట్టూ ఐదారు సార్లు తిరుగుతాయట. మరణం వచ్చే ముందు మనకు కలలో గుడ్లగూబ గాని, ఖాళీ చేసిన ఊరు కానీ కనిపిస్తాయట.
ఇక మరణం వచ్చేముందు రోజు పుష్పక విమానం కలలో కనిపిస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే పావురం, కాకి, గద్ద, ఏ ఒక్కటైనా మన తల మీద వాలిన, తలని తన్నుకుంటూ వెళ్లిన మరణ సంకేతంగా చెబుతున్నారు. చనిపోయే ముందు రోజు శివపార్వతులు దంపతుల రూపంలో పరామర్శించడానికి వస్తారట. మరణం వచ్చేముందు రెండు పిచ్చుకలు నీళ్లలో స్నానం చేస్తూ కనిపిస్తాయని, తీతువు పిట్ట ఇంటిపై నుండి వెళుతుందని చెబుతున్నారు. ఇక మరణానికి ముందు రోజు రాత్రి యమభటులు పేరు అడిగి కన్ఫామ్ చేసుకుంటారని చెబుతున్నారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం మరణం ముందు ఈ సంకేతాలన్నీ వస్తాయని చెబుతున్నారు.