Cooking: స్నానం చేయకుండా వంట చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
సాధారణంగా ఇంట్లోని మహిళలు ఉదయం లేచిన తర్వాత కొన్ని రకాల పనులు చేయాలి కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో పెళ్లైన స్త
- By Anshu Published Date - 06:45 PM, Mon - 29 May 23

సాధారణంగా ఇంట్లోని మహిళలు ఉదయం లేచిన తర్వాత కొన్ని రకాల పనులు చేయాలి కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో పెళ్లైన స్త్రీలు లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత ఇతర పనులు చేయాలని చెబుతూ ఉంటారు. కొంతమంది అవేవీ పట్టించుకోకుండా స్నానం చేయకుండానే వంట గదిలోకి వెళ్లి త్వర త్వరగా వంటలు చేసేసి ఆ తర్వాత తీరికగా స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే హిందూ ధర్మాన్ని అనుసరించే వారు పూర్వం రోజుల్లో స్నానం చేసే ఇంట్లో అగ్గి వెలిగించేవారు.
స్నానం చేయనిది మంట జోలికి వెళ్లేవారు కాదు. మాములుగా చాలా పూజలు ఆచారాలు స్నానంతో మొదలవుతాయి. ఎందుకంటే స్నానం చేస్తే అది ఒక వ్యక్తిని మానసికంగా, ఎమోషనల్ గా కూడా శుభ్రం చేస్తుంది. అందుకే అన్ని పవిత్ర ప్రార్థనా స్థలాల్లో చెరువులు, బావులు, కోనేర్లు, నదులు ఉంటాయి. అయితే పూర్వం పొయ్యి వెలిగించగానే కర్రలు పెట్టి ముందు ఒక చుక్క నెయ్యి వేసి అగ్నిహోత్రుడికి నమస్కరించి గిన్నెపెట్టేవారు. మళ్లీ వంట పూర్తైన తర్వాత మరో చుక్క నెయ్యివేసి కొన్ని మెతుకులు అగ్నిహోత్రుడికి సమర్పించేవారు. సాధారణంగా ఆలోచనలు, తీరు, ప్రవర్తనా విధానం అన్నీ తినే భోజనం ఆధారంగానే ఉంటాయని చెబుతారు.
ఇందుకు ఉదాహరణ ఏంటంటే.. పండుగ రోజుల్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వంటచేసి దేవుడికి నివేదించి తింటారు. మిగిలిన రోజుల్లో ఇంట్లో పనంతా అయ్యాక స్నానం చేస్తారు. పండుగ రోజు తిన్న భోజనం మీలో సానుకూల ఆలోచనలు, దైవత్వాన్ని నింపితే స్నానం చేయకుండా వండిన వంటను తిన్నవారిలో ఆ సున్నితత్వం ఉండదని, శౌచం లేకుండా వండిన వంట తిన్నవారిలో రాక్షస ఆలోచనలే వస్తాయని పండితులు చెబుతున్నారు. అప్పట్లో పొయ్యిలో నెయ్యి వేసినట్టు ఇప్పుడు స్టౌ లు కదా అన్న సందేహం కలగవచ్చు. అంటే కనీసం స్నానం చేయమని చెప్పడం ఈ కథనం ముఖ్య ఉద్దేశం. స్నానం అనేది దినచర్యలో భాగం. వ్యక్తిగత పరిశుభ్రతకోసం కొంత సమయాన్ని వెచ్చించి మరీ సేదతీరుతాం. స్నానం శరీరంలో ఉత్తేజాన్ని పెంచుతుంది, బద్దకం వీడేలా చేస్తుంది. బతకడానికి అత్యంత ముఖ్యమైన పని తినడం. అలాంటి ఆహారాన్ని స్నానం చేయకుండా, బద్దకాన్ని వీడకుండా వండటం అనారోగ్యానికి సూచన.