Vasthu: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బును ఏ దిక్కున దాచుకోవాలో తెలుసా? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా?
ఇంట్లో డబ్బులు ఏ దిశలో దాచుకోవాలి. డబ్బులు దాచుకోవడానికి దిశలు కూడా ఉన్నాయా, అలాగే ఇనుప బీరువాలో ధనం దాచిపెట్టకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Fri - 9 May 25

వాస్తు శాస్త్ర ప్రకారం చాలామంది అనేక విషయాలను పాటిస్తూ ఉంటారు. స్థలం కొనుగోలు చేసే విషయం నుంచి ఇంట్లో వస్తువులు అమరిక విషయం వరకు ప్రతి ఒక్క విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాటిలో డబ్బు విషయంలో కూడా చాలామంది అనేక విషయాలు పాటిస్తూ ఉంటారు. అంటే డబ్బులు దాచిపెట్టే విషయం అలాగే డబ్బులు ఎలాంటి ప్రదేశాలలో ఉంచాలి ఇలా అనేక విషయాల గురించి పాటిస్తూ ఉంటారు. ఏ రాశి వారు అయినా సరే, ఏ నక్షత్ర జాతకులైనా సరే ఇంట్లో ఉత్తరం దిక్కున ధనాన్ని దాచాలట. చాలామంది ఇనుప బీరువాల్లో డబ్బు పెడుతుంటారు.
కానీ అలా పెట్టకూడదని చెబుతున్నారు. బంగారం అయినా సరే డబ్బు అయినా సరే ఇనుప దాంట్లో పెట్టకూడదట. బీరువాని ఐరన్ తో చేస్తారు. ఐరన్ ని ఉత్తరాన పెట్టకూడదట. ఎత్తైనది, బరువైనది కాబట్టి అందులో పెట్టకూడదని చెబుతున్నారు. ఉత్తరం అనేది కుబేర స్థానం, లక్ష్మీ స్థానం. కాబట్టి ఇనుప బీరువాను ఉత్తరంలో పెట్టకూడదట. ఇనుప బీరువాను దక్షిణం లేదా పడమరలోనే పెట్టాలట. ఇనుప బీరువాలో ధనాన్ని ఎందుకు పెట్టకూడంటే ఇనుము శనేశ్వరుడు. ఆయన నివాస స్తానం పడమర స్థానం. ఐరన్ బీరువాలన్నీ పడమర భాగంలో పెట్టుకోవాలట. అది నైరుతి భాగంలో ఉండాలట.
తూర్పు ముఖంగా ఉండాలని చెబుతున్నారు. పడమర ఆయన నివాస స్థానం. కాబట్టి ఇనుప బీరువాలను నైరుతి భాగంలో పెట్టాలట. సెకండ్ ఆప్షన్ గా ఉత్తర భాగంలో పెట్టుకోవచ్చట. ధనాన్ని దాచాల్సింది కేవలం ఉత్తర భాగంలో మాత్రమే. ఉత్తరం దిక్కులో మాత్రమే దాచుకోవాలని, కర్ర, చెక్కతో తయారు చేసిన బీరువాన్ని ఉత్తరంలో పెట్టుకోవచ్చట. మనం సింహ ద్వారాన్ని అంటే గడపను కర్రతో చేసి ప్రతిరోజు పూజిస్తాము. లక్ష్మి నివాస స్థానాలు ప్రధానంగా చెప్పాలట. అంటే కర్ర, పాలు, పూలు. ఇవన్నీ లక్ష్మీ నివాసాలని ఇందులో ప్రధానమైనది కర్ర అని చెబుతున్నారు. అటువంటి కర్రతో చేసినటువంటి బీరువాను ఉత్తర భాగంలో పెట్టుకుని ధనాన్ని దాచుకోవచ్చట. కర్రతో చేయడం వల్ల అది బరువు కాదట. గోడలోనే కర్రతో బీరువాను ఏర్పాటు చేసుకుని అందులో ధనాన్ని దాచుకోవచ్చట. అలా చేయడం అత్యంత శుభప్రదం. లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు.