Betel Leaves: ఇంట్లో తమలపాకుల చెట్లు పెంచుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్లలో తమలపాకు చెట్లను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. హిందువులు ఎటువంటి శుభకార్యములో అయినా కూడా ఈ తమల
- By Nakshatra Published Date - 04:15 PM, Sun - 3 December 23
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్లలో తమలపాకు చెట్లను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. హిందువులు ఎటువంటి శుభకార్యములో అయినా కూడా ఈ తమలపాకు కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి తమలపాకును ఇండ్లలో పెంచుకున్నప్పుడు అనేక రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అంటూ ముట్టు తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే శాస్త్ర ప్రకారం ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకోవచ్చా. అలా పెంచుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో అక్కడ శనీశ్వరుడు ఉండడు అని చెప్తూ ఉంటారు.
ఈ తమలపాకు తీగ ఇంట్లో ఉంటే కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం కలిసి వస్తుందని, భూతప్రేత పిశాచాలు కూడా మన ఇంటి దరిదాపులకు రావు అని చెబుతుంటారు. అంతే కాకుండా తమలపాకు తీగ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపం అని,ఈ తీగ ఇంట్లో ఉంటే ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. తమలపాకు తీగ చిగురు వస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. తమలపాకు తీగ చక్కగా పందిరి లాగ ఎదుగుతుంటే మన ఇంట్లో కష్టాలు అప్పులు కూడా ఇట్లే తీరిపోతాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు.
తమలపాకు చెట్టు ఎంత బాగా పెరిగితే మనకు అంత మంచి జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. కాగా తమలపాకు ను కేవలం ఆధ్యాత్మిక విషయంలోనే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. తమలపాకు మొక్కని ఇంట్లో ఉంచుకోవడం తప్పుకాదు. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల దేవతల ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే తులసి కోటను ఎలా అయితే మనం పవిత్రంగా భావిస్తామో ఎలా అయితే గౌరవంగా చూస్తామో తమలపాకు మొక్కని తమలపాకు వృక్షాన్ని కూడా అంతే పవిత్రంగా అంతే గౌరవంగా చూసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు మొక్కలో చేతులు కడుక్కోకూడదు ఏ మొక్కలో అయినా చేతులు కడుక్కోవచ్చు కానీ తులసి తమలపాకు ఇటువంటి మొక్కల్లో చేతులు కడుక్కోవడం మంచిది కాదు.
Related News
Garlic: ఆ ఒక్క పని చేస్తే చాలు నెలలపాటు పాడవని వెల్లుల్లి.. అదెలా సాధ్యం అంటే?
మన వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిం