Budhavar Pooja: బుధవారం వినాయకుడిని ఈ విధంగా పూజిస్తే చాలు.. శని మీ జోలికి జీవితంలో రాడు?
భారతదేశంలో హిందువులు వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి పూజిస్తూ ఉంటారు. సోమవారం శివుడికి, గురువారం
- By Nakshatra Published Date - 07:50 PM, Tue - 8 November 22
భారతదేశంలో హిందువులు వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి పూజిస్తూ ఉంటారు. సోమవారం శివుడికి, గురువారం సాయిబాబా, శనివారం శనీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అలా బుధవారం గణేష్ డికి పూజిస్తూ ఉంటారు. బుధవారం రోజున వినాయకుడిని పూజించడం అలాగే ఉపవాసం ఉండడం వల్ల అనుగ్రహం లభిస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి పని మొదలుపెట్టిన అందులో మొదటగా విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి వినాయకునికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం రోజున ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది.
మరి బుధవారం రోజు వినాయకుడిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వినాయకుడికి శమీ మొక్క అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం రోజు వినాయకునికి శమీ మొక్కను సమర్పించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం శాంతి నెలకు ఉంటుంది.అలాగే వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం రోజు వినాయకుడి పూజలు ఎర్రటి సింధూరం తిలకం రాయాలి. ఈ విధంగా చేయడం వల్ల వినిగ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే పూజలో అన్నం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. విఘ్నేశ్వరుడికి కూడా అన్నం అంటే చాలా ఇష్టం.
కాబట్టి పూజ సమయంలో ఎవరైనా వస్తే వారికి బియ్యానికి బదులుగా అన్నం పెట్టి పంపించాలి. అలా చేస్తే విగ్నేశ్వరుడు సంతోషించి కోరుకున్న ఫలితాలను ఇస్తాడు. అలాగే బుధవారం రోజు వినాయకుడికి నెయ్యి బెల్లం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడు సంతోషపడతాడు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే బుధవారం రోజు గణపతికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయి. బుధవారం గరికతో పూజ చేయడం వల్ల శనీశ్వరునివల్ల కలిగే ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడవచ్చు.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�