Vasthu Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బిజినెస్ సరిగ్గా అవ్వడం లేదా.. అయితే ఈ ఆరు రకాల పనులతో సక్సెస్ గ్యారెంటీ!
ఎన్ని రకాల పరిహారాలు పాటించినా ఎన్ని పూజలు చేసినా కూడా బిజినెస్ సరిగా జరగక తెగ ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు రకాల పనులు చేస్తే వ్యాపారంలో లాభాలు చూడటం ఖాయం అంటున్నారు పండితులు.
- By Anshu Published Date - 10:30 AM, Sun - 4 May 25

మాములుగా వ్యాపారాలు గాలి వాటం అని అంటూ ఉంటారు. అంటే గాలి ఎలా అయితే వీస్తుందో ఆ విధంగానే వ్యాపారాలు జరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. బిజినెస్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. అయితే కొంతమందికి ఎప్పుడో ఒకసారి బాగా జరిగితే ఇంకొందరికి బిజినెస్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ నష్టాలే ఉంటాయి. అలా బిజినెస్ లో మంచి లాభాలు చూడడం కోసం కొంతమంది ఎన్నెన్నో పూజలు వాస్తు నియమాలు,పరిహారాలు పాటిస్తూ ఉంటారు. మీరు కూడా అలా తరుచుగా బిజినెస్ లలో నష్టాలను చూస్తూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే పనులు చేయాల్సిందే అంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వ్యాపార స్థలం యొక్క ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా ఈశాన్య దిశలో ఉండటం శుభప్రదం అని చెబుతున్నారు. ఈ దిశ సానుకూల శక్తిని ఆకర్షిస్తుందట. అలాగే వ్యాపార వృద్ధికి దోహదపడుతుందని, ఈ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, అడ్డంకులు లేకుండా ఉంచాలని చెబుతున్నారు. అదేవిధంగా వ్యాపార ప్రదేశంలో యజమాని లేదా మేనేజర్ ఆఫీసు దక్షిణం పశ్చిమ దిశలో కూర్చోవడం మంచిదని చెబుతున్నారు. ఈ దిశలు అధికారాన్ని, నియంత్రణను సూచిస్తాయట. యజమాని కూర్చునేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చూడటం శ్రేయస్కరం అని చెబుతున్నారు.
అలాగే వ్యాపార ప్రదేశంలో డబ్బు సంబంధి విభాగం లేదా క్యాష్ కౌంటర్ ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆర్థిక ప్రవాహం సాఫీగా జరుగుతుందట. ఈ దిశ కుబేరుడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు, ఇది సంపదను ఆకర్షిస్తుందట. అదేవిధంగా సరుకులు లేదా స్టాక్ ఉంచే గదిని దక్షిణ-పశ్చిమ దిశలో ఏర్పాటు చేయాలట. ఈ దిశ స్థిరత్వాన్ని సూచిస్తుందట. అలాగే వస్తువులు సురక్షితంగా ఉండేలా చేస్తుందట.
అదేవిధంగా వ్యాపార స్థలంలో శుభ్రతను పాటించడం చాలా అవసరం. చెత్త, అస్తవ్యస్తత సానుకూల శక్తిని అడ్డుకుంటాయట. అలాగే ఆఫీసు లేదా షాపులో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఇది ఉత్సాహాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అదేవిధంగా వ్యాపార పదేశంలో గోడలకు తేలికపాటి రంగులు ఉపయోగించాలట. ఇవి ప్రశాంతతను కలిగిస్తాయని, ఈశాన్య దిశలో చిన్న జల వనరి లేదా గణేషుడి విగ్రహం ఉంచడం శుభప్రదంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.