Zodiac Signs : కుజుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు…త్వరలో ఈ 5 రాశులవారు ధనవంతులు అవుతారు..!!
గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రోజు ఉదయం కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు.
- By hashtagu Published Date - 06:49 AM, Mon - 17 October 22
గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రోజు ఉదయం కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. నవంబర్ 13వరకు కుజుడు ఈ రాశిలోనే ఉంటాడు. ఈ మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల 5 రాశులవారికి ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్యులు అంటున్నారు.
మేషం
మేషరాశి వారికి అంగారక సంచారం..సానుకూల మార్పులను తెస్తుంది. కార్యాలయంలో పనిపట్ల శక్తి, ఏకాగ్రతను చూసి సీనియర్ అధికారులు అభినందిస్తారు. ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతారు. కోపం అదుపులో ఉంటుంది. ధనలాభం ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
సింహం
ఈ రాశివారికి అంగారక గ్రహం సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా నెరవేరని కోరికలన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కార్యాలయంలో శక్తివంతంగా పనిచేస్తారు. వైవాహిక జీవితం ఆశాజనంగా ఉంటుంది. భాగస్వామితో శృంగార క్షణాలు గడుపుతారు.
కన్య
కుజుడు మారడం వల్ల మీ వృత్తిలో అనేక శుభయోగాలు కలుగుతాయి. ఆర్థిక జీవితంలో అపారమైన ధనలాభం ఉంటుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమయం. కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది. మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. ఇంటి సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి.
మకరం
అంగారక సంచారం వల్ల ఈ రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. మీ రంగంలో పెద్ద విజయాలను పొందుతారు. విద్యారంగంలో మీ పనితీరు ప్రశంసనీయం. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సంపాదన పెరుగుతుంది. కొత్త సంపద వనరులు ఏర్పడతాయి.
మీనం
ఈరాశివారికి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. స్థిరాస్తి నుంచి అదనపు డబ్బు సంపాదిస్తారు. వ్యాపారలు తమ వ్యాపారాన్ని విస్తురించుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లబిస్తుంది. భాగస్వామితో కలిసి వైవాహిక ఆనందాన్ని గడుపుతారు.
Related News
Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ
Ugadi 2024 : ఉగాది పండుగ ఏప్రిల్ 09న రాబోతోంది.