Netherlands Lockdown : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నెదర్లాండ్స్‌లో లాక్‌డౌన్ విధింపు
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్ క్రిస్మస్ లాక్‌డౌన్‌ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు.
- Author : Hashtag U
Date : 19-12-2021 - 10:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్ క్రిస్మస్ లాక్‌డౌన్‌ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసరం కాని దుకాణాలు, బార్‌లు, జిమ్‌లు, క్షౌరశాలలు, బహిరంగ వేదికలు మూతపడనున్నాయి. క్రిస్‌మస్ నేపథ్యంలో ఒక్కో ఇంటికి ఇద్దరు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. జనవరి 9 వరకు పాఠశాలలు మూసిఉంటాయని, లాక్‌డౌన్ నిబంధనలు జనవరి 14 వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. కాగా, జనవరి మధ్య నాటికి ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతం కావచ్చునని ఇయు చీఫ్ ఉర్సులా వాన్ డేర్ లేయన్ హెచ్చరించారు.
ఇటు బ్రిటన్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. లండన్‌లో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఒమిక్రాన్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో అధిక ప్రమాదకర కోవిడ్ దేశాల జాబితాలో బ్రిటన్ ఉన్నట్లు జర్మనీ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రయాణీకులపై కఠిన ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వైరస్ ర్యాపిడ్ స్పీడ్‌తో వ్యాప్తిచెందుతుండటంతో యూరప్‌లోని అన్ని దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, ఆంక్షలు విధించాయి. యూరప్‌లో ఇప్పటివరకు 89 మిలియన్ల కరోనా కేసులు నమోదవగా, కోటీ 50 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.