HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >Night Curfew Guidelines In Andhra Pradesh

Night Curfew in AP : ఏపీలో క‌ర్ఫ్యూ మొద‌లు..

ప్ర‌తి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 వరకూ కర్ఫ్యూ ను ఏపీ రాష్ట్రంలో విధించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం నుంచి క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.

  • Author : CS Rao Date : 18-01-2022 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
night curfew
night curfew

ప్ర‌తి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 వరకూ కర్ఫ్యూ ను ఏపీ రాష్ట్రంలో విధించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం నుంచి క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. సినిమా హాళ్లలో 50 శాతం సీటింగ్‌ ఉంటుంది. దేవాలయాలు, ప్రార్థన మందిరాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.  మాస్క్‌ ధరించని వారికి రూ.100 జరిమానా విధించాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాలను జారీ చేశారు. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి.
కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరికోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది.

కోవిడ్ పెరిగితే..ఇంకా ఇతర నిబంధనలు…!
ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయానికొస్తే  బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలి.  సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించాలి.ఇక ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు ధరించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి.లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రదేశాల్లో కోవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్లు మూసివేసేలా చర్యలు ఉంటాయి. మార్కెట్‌ అసోసియేషన్లు, యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి.జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు ఈ నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని నిబంధనలు, ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు ఉంటాయి.రాష్ట్రములో పలు ప్రాంతాల్లో గ్రౌండ్లోలో ఎగ్జిబిషన్ ను పూర్తిగా మూత వెయ్యలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • corona
  • night curfew

Related News

Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా

  • Nara Bhuvaneshwari Anna Canteens

    Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd