India Covid-19 Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- By HashtagU Desk Published Date - 11:22 AM, Mon - 14 February 22

ఇండియాలో కరోనావైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34,113 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి నిన్న 91,930 మంది కోలుకోగా, కరోనా కారణంగా 346 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 4,26,65,534 మంది కరోనా బారిన పడగా, 4,16,77,641 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5,09,011 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉండగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 429 కరోనా కేసులు నమోదవగా, కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు 7,82,681 మందికి కరోనా సోకగా, 7,64,594 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పటి వరకు 4,108 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం 12,983 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఏపీలో నిన్న కొత్తగా 749 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కరోనా కారణంగా ముగ్గురు మరణించగా, 6,271 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 23,12,778 మంది కరోనా బారినపడగా, వారిలో 22,79,152 మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో18,929 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.