India Covid-19 Updates: ఇండియాలో లక్ష దిగువకు చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు..!
- By HashtagU Desk Published Date - 11:48 AM, Tue - 1 March 22

ఇండియాలో క్రమంగా రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న భారత్‌లో 180 మంది ప్రాణాలు కోల్పోగా, 16,864 మంది కరోనా నుండి కోలుకున్నారని, కేంద్ర వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది. ఇక ఇప్పటి దేశ వ్యాప్తంగా 4,29,31,045 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
అలాగే ఇండియాలో ఇప్పటికు కరోనా నుండి 4,23,24,550 మంది కోలుకోగా, కరోనా మహమ్మారి కారణంగా 5,14,023 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం దేశంలో 92,472 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.77 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అలాగే దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.58 శాతానికిపైగా ఉంది. ఇక ఇప్పటివరకు ఇండియాలో 1,77,70,25,914 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.